టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ
గతవారమే టెస్ట్ క్రికెట్ నుంచి నిష్క్రమించిన రోహిత్ శర్మ;
Translated by : Chepyala Praveen
Update: 2025-05-12 07:43 GMT
టెస్ట్ క్రికెట్ కు మరో క్రీడా దిగ్గజం దూరమైంది. కొన్ని రోజుల క్రితమే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ లకు దూరమవగా, తాజాగా విరాట్ సైతం బాయ్ బాయ్ చెప్పేశాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
‘‘నన్ను పరీక్షించిన, నన్ను తీర్చిదిద్దిన, జీవితాంతం నేను మోయగలిగిన పాఠాలను నేర్పిన ఫార్మాట్’’ అని టెస్ట్ క్రికెట్ పై తన ప్రేమను ఇన్ స్టాగ్రామ్ లో ఒక భావోద్వేగ పోస్ట్ లో కోహ్లీ పేర్కొన్నాడు.
పరీక్షా సమయం..
ముప్పై ఆరేళ్ల క్రితం భారత్ తరఫున 123 టెస్ట్ ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 46.85 సగటుతో 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. గత సంవత్సరం టీ20 ప్రపంచకప్ గెలిచిన తరువాత కోహ్లీ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు టెస్ట్ లకు సైతం వీడ్కోలు పలకడంతో కేవలం వన్డేలకు మాత్రమే ఆడతాడు.
సులభం కాదు.. సరైనది అనిపిస్తుంది..
‘‘నేను ఈ ఫార్మాట్ నుంచి వైదొలగడం అంత సులభం కాదు. కానీ అదే సరైనదని అనిపిస్తుంది. నా దగ్గర ఉన్నవన్నీ నేను దానికి(టెస్ట్ లకు) ఇచ్చాను. నేను ఆశించిన దానికంటే చాలా ఎక్కువ అది నాకు తిరిగి ఇచ్చింది’’ అని కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో ప్రకటించాడు. తన ప్రయాణంలో సహకరించిన అందరికి కోహ్లీ కృతజ్ఞతలు తెలిపారు.
కొన్ని రోజుల క్రితమే టెస్ట్ క్రికెట్ కు స్పిన్ దిగ్గజం అశ్విన్ రిటైర్మైంట్ ప్రకటించారు. గతవారం రోహిత్ నిష్క్రమించాడు. ఇప్పుడు తాజాగా కోహ్లీ సైతం టెస్ట్ లను వీడటంతో ఇంగ్లండ్ పర్యటనకు అనుభవలేమి జట్టుతో భారత్ వెళ్లబోతోంది.
ఆసీస్ పర్యటనలో కోహ్లి తొలి టెస్ట్ లో సెంచరీ సాధించాడు. కానీ మిగిలిన అన్ని మ్యాచ్ లలో విఫలం అయ్యాడు. ఏకంగా తొమ్మిది ఇన్సింగ్స్ లలో ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని వేటాడి వికెట్ సమర్పించుకున్నాడు. అప్పట్లో కోహ్లీ ఆటపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
2014 లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన కోహ్లీ తొలిసారిగా తన ఆఫ్ స్టంప్ బలహీనతను బలహీన పెట్టుకున్నాడు. తరువాత 2018 లో రెండో సారి పర్యటనకు వెళ్లిన సమయంలో ఏకంగా నాలుగు సెంచరీలు బాదేశాడు. అయితే గత ఏడాది జరిగిన బోర్డర్ - గవాస్కర్ ట్రోఫిలో మరోసారి ఇదే బలహీనతను బయటపెట్టుకున్నాడు.