Tirumala || తిరుమలలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం..!
ఫిబ్రవరి 4న తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనాలు, అన్ని ప్రివిలైజ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.;
తిరుమలలో ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనములో సమావేశం నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా సామాన్య భక్తుల ఏర్పాట్లు పై సమీక్ష చేయనున్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకొని. టీటీడీ ఛైర్మన్ భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పనపై అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. రథసప్తమి నాడు తిరుమల శ్రీవారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న 2 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. తిరుమలలో రథసప్తమి ఉండటంతో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అంతేకాదు ఫిబ్రవరి 4న తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనాలు, అన్ని ప్రివిలైజ్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.