
వేరే పార్టీ అభ్యర్ధికి ఓటేసిన అసదుద్దీన్ !!
సోమవారం ఉదయం ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ పాతబస్తీ చాంద్రాయణ గుట్ట సమీపంలోని శాస్త్రిపురం పోలింగ్ కేంద్రానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటేశారు. చేవేళ్ల పార్లమెంట్ పరిధి కిందకు అసద్ నివాస ప్రాంతం వస్తుంది. కానీ ఇక్కడ ఎంఐఎం అభ్యర్థిని పోటీలో ఉంచలేదు. దీంతో ఆయన ఇతర పార్టీ అభ్యర్ధికి కానీ, నోటాకు కానీ ఓటు వేసి ఉండొచ్చు. కాగా ఆయన హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థిగా పోటీలో ఉన్నా... ఈ నియోజకవర్గ పరిధిలో ఆయనకి ఓటు లేదు.
Next Story