
బీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత సంబురాల్లో బీజేపీ శ్రేణులు
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు బీజేపీకి ఆందోళన కలిగించేవా?
ప్రతిపక్షాలు అనైక్యత వల్లే అది కాస్త బలం ఫుంజుకోగలిగిందా?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు భారీ విజయంగా బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఫలితాలను నిశితంగా పరిశీలన చేస్తే గెలిచిన వారు, ఓడిన వారికి మధ్య తేడా స్పల్పమే అనే వాస్తవం బయటపడుతుంది.
జనవరి 16న ప్రకటించిన ఫలితాలు బీజేపీ శిబిరంలో ఆనందం రేకేత్తించినప్పటికీ కాషాయపార్టీకి ముందుముందు కష్టాలు తప్పవనే సంకేతాలు కూడా బయట శక్తుల నుంచి వినిపిస్తున్నాయి.
ఓడిపోయిన శక్తులకు కూడా ఆశలు సజీవంగా ఉన్నాయి. ఈ విజయంలో ఆందోళన చెందాల్సిన పక్షాలు రెండు ఉన్నాయి, అవేంటంటే మహాయుతికి చెందిన ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ. వాటికి భవిష్యత్ అంతా ప్రశ్నార్థకంగా అగమ్య గోచరంగా ఉంది.
15 ఏళ్లలో బీజేపీ ఎదుగుదల..
2009-13 మధ్య కేవలం 300 కార్పొరేటర్లతో ఉన్న బీజేపీ బలం నేడు 1425 కు చేరింది. మహారాష్ట్రలో మొత్తం 2,869 కార్పొరేటర్ స్థానాలు ఉన్నాయి. దాదాపు అందులో సగం బీజేపీ దక్కించుకుంది.
శివసేన విడిపోవడం కమలదళానికి బాగా లాభించింది. అప్పట్లో శివసేన లేకుండా బీజేపీ పోటీ చేస్తే 29 స్థానాలలో బీజేపీ 13 సొంతంగా గెలిచింది.
దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్ బడ్జెట్ ముంబై సొంతం. అది ఏటా రూ.75 వేల కోట్ల బడ్జెట్ ను అది ప్రవేశ పెడుతుంది. ఇది ఆరు రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ ఆరు మిత్రపక్షాలతో కలిపి అధికారం దక్కించుకుంది. బీజేపీ ఇప్పుడు సీనియర్ మిత్రపక్షాన్ని సొంత ఆస్తిలా ఉపయోగించుకోబోతోంది.
ఠాక్రేల నీడలో..
ఫలితాలు ఎవరికి నిరాశజనకంగా ఉన్నాయో అంచనావేసి చెప్పడం కష్టం. ఒకప్పుడు ఒకే శక్తిగా ఉన్న శివసేన విడిపోయాక తరువాత అధికారం దక్కించుకోవడానికి ఉద్దవ్, రాజ్ ఠాక్రేలు చేతులు కలిపారు. దాదాపు 25 సంవత్సరాలుగా శివసేన చేతిలోనే ముంబై ఉంది. ఇప్పటి ఓటమిలో కూడా వారి పట్టు పూర్తిగా సడలలేదు.
2017 నాటి బీఎంసీ ఎన్నికల్లో శివసేన 84 స్థానాలు గెలుచుకుంది. ఇందులో 50 సీట్లను వీరి కూటమి నిలుపుకోగలిగింది. పాత శివసేన బలమైన ప్రదేశాలలో ఠాక్రే మానియా ఇంక ఉందని స్పష్టం చేస్తోంది.
శివసేన ఐక్యంగా ఉంటే జనవరి ఫలితాలు మరోవిధంగా ఉండేవి. 2017 నాటి కంటే వాటి బలం పెరిగిందని తెలిసేది. ఇది తమ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని నిరూపించుకునే అవకాశం ఉండేది.
ముక్కలుగా ప్రతిపక్షం..
ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ పూర్తిగా విడిపోయాయి. శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన, ఇతర చిన్న పార్టీలు కలిసి పోటీ చేస్తే ఓట్లు చీలిపోకుండా అవి దాదాపుగా విజయానికి దగ్గరగా చేరేవని ఫలితాలను బేరీజు వేస్తే తెలుస్తోంది.
ఉద్దవ్, రాజ్ ఠాక్రే లకు చెందిన శివసేకు 71 సీట్లు, కాంగ్రెస్ కు 24 సీట్లు, సమాజ్ వాదీ పార్టీ రెండు, శరద్ పవార్ ఎన్సీపీ ఒక స్థానం గెలుచుకున్నాయి. ఎంవీఏ సమిష్టిగా పోటీ చేసి ఉంటే 98 మంది కార్పొరేటర్లు ఉండేవారు. ఇది మహాయుతి కంటే కేవలం 23 సీట్లు తక్కువ. మెజారిటీకి 16 సీట్లు తక్కువ.
ఎంవీఏ ఐక్యంగా ఉండటంతో పాటు అదనపు శక్తులైన ఎంఎన్ఎస్, ఎంఐఎం వంటి వాటిని చేర్చుకుంటే బీఎంసీ ఫలితాలు భిన్నంగా ఉండేవి. కొన్ని డివిజన్లలో శివశక్తి కూటమి కంటే కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యక్తిగతంగా పోలైన ఓట్ల కంటే తక్కువగా ఉన్నాయి.
మహాయుతి బాగా లేదా?
పైన చెప్పిన కొన్ని పరిణామాల వల్ల బీజేపీకి బీఎంసీలో విజయం దక్కింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రచారం చేసినట్లు శివసేన అవినీతి కారణం కాదు. వాస్తవానికి బీజేపీ అక్కడ అధికారంలో ఉంది.
అది దానికున్న ప్రయోజనాలను కచ్చితంగా వాడుకుంది. అయితే దాని బలం 2017 లో 82 స్థానాలకు ఉండగా, ప్రస్తుతం 89 మాత్రమే పెరిగింది. దీనికి ప్రధాన కారణం ప్రతిపక్షాల ఓట్ల చీలిక.
106 మంది కార్పొరేటర్లతో (ఎంఐఎంతో కలుపుకుని) ప్రతిపక్ష కూటమి ఇప్పటికి బలంగానే ఉంది. ఇక్కడ విజయం పార్టీల స్వీయ రక్షణ విధానాల వల్లే దూరమైంది.
విజయంలో బీజేపీ బెదిరింపు తీసుకుని తన మిత్రులైన షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలను వ్యక్తిగత రాజకీయా ప్రయోజనాలకు ఆటంకం కలిగిస్తామని చెప్పడం ద్వారా అది పీఠంపై కూర్చోవచ్చు.
బీఎంసీ మేయర్ ఎన్నిక జరిగే వరకూ షిండే తన కార్పొరేటర్లను హోటళ్లకు తరలించనున్నారు. పూణే, పింప్రి- చించ్ వాడ్ లలో తన అధికారం కోసం అజిత్ పవార్- శరద్ పవార్ తో చేతులు కలిపారు. ఇది మహయుతిలో అపనమ్మకం పెరిగిందని సూచిస్తోంది.
కాంగ్రెస్ ది ఓటమి కాదు..
ముంబై ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నిరాశజనక ఫలితాలను నమోదు చేసింది. 29 మున్సిపల్ కార్పొరేషన్ లలో అది కేవలం 324 కార్పొరేటర్లను మాత్రమే గెలుచుకోగలిగింది. గతంలో దానికి 439 మంది కార్పొరేటర్లు ఉండేవారు. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో 614 మంది కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహించారు.
ఇప్పుడు దాని స్థానం అప్రాధాన్యంగా మారింది. దీనికి కారణం దాని నాయకులు క్రమంగా దూరం కావడమే. 2014 నుంచి ఎన్నికల్లో పదే పదే ఓడిపోవడంతో అది క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతోంది. సంస్థాగత లోపాలు ఉన్నప్పటికీ లాథూర్ లో అది మెజారిటి సాధించింది. భీవండి, చంద్రపూర్, పర్భాని, కొల్హాపూర్ కార్పొరేషన్ల సింగల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది.
అట్టడుగు వర్గాలకు చేరువకావడంలో విఫలం, వర్గ విభేదాలు, స్థానిక సంస్థల పట్ల కేంద్ర నాయకుల నిర్లక్ష్య వైఖరి దీనికి ప్రధాన కారణాలు. వీటిని సరిదిద్దినప్పుడే దానికి విజయాలు దక్కే అవకాశం ఉంటుంది.
ఎంఐఎం అడుగులు..
కాంగ్రెస్ దాని మిత్రపక్షాలను ఆందోళనకు గురిచేసే అంశం ఏంటంటే.. మహారాష్ట్రలో ఎంఐఎం విస్తరణ. ఓవైసీ పార్టీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 125 కార్పొరేటర్లను గెలిపించింది. 2017 లో దానికి 81 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు క్రమంగా దాని ఉనికి విస్తరిస్తోంది.
ముంబై, మాలేగావ్, ధూలే, అకోలా, నాందేడ్, సోలాపూర్, అమరావతి, ఔరంగాబాద్, జల్నా వంటి ముస్లిం ప్రాబల్యం ప్రాంతాలలో ఎంఐఎం ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, ఎస్పీ, ఎన్సీపీ వంటివి మైనారిటీ ఓట్ల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ వాటికి ప్రయోజనం దక్కడం లేదు.
అసలు ఓడిపోయిందేవరూ?
ప్రస్తుతం ఎన్నికల ఫలితాలను మరొక కోణంలో విశ్లేషిస్తే కాంగ్రెస్, శివసేన గ్రూపులకు ఎలాంటి నష్టం లేదు. కానీ నిజంగా దెబ్బతిన్నది ఎవరంటే అది పవార్ గ్రూప్ మాత్రమే. అసెంబ్లీ ఎన్నికల్లో సులభంగా బాబాయ్ ను ఓడించిన అబ్బాయ్ గ్రూప్, తరువాత తన స్థానాన్ని పదిలం చేసుకున్నట్లు సంకేతాలు పంపుతున్నాడు. అయితే కార్పొరేషన్ ఎన్నికలు ఇద్దరికి చేదు మాత్రలు అందించాయి. వారు బీజేపీ విస్తరణకు మొదటగా ఉబిలోకి కూరుకుపోయే వ్యక్తులుగా తేలింది.
పవార్లకు పవర్ తగ్గిందా?
పశ్చిమ మహారాష్ట్రలో ముఖ్యంగా పూణే, పింప్రి- చించ్వాడ్ లో శరద్ పవార్, అజిత్ పవార్ లు బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. కానీ వారి విభేదాలు కుటిల రాజకీయాల వల్ల ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఇక్కడ రెండు వర్గాలు పతనం చెందాయి.
సీనియర్ పవార్ హయాంలోనే పార్టీ చీలిపోవడం, వృద్దాప్యం, ఉదాసీనత వలన ఆ పార్టీ కోలుకునే అవకాశం లేదు. అజిత్ కు కూడా ఇది తీవ్రమైన హెచ్చరికే. అతను ఒక నాలుగు రోడ్ల చౌరస్తా లో నిలబడి ఉన్నాడు. బీజేపీ నేతృత్వంలోని కూటమికి జూనియర్ భాగస్వామిగా ఉండటం, తిరిగి బాబాయ్ వద్దకు చేరడం ఇది పార్టీని తిరిగి బలోపేతం చేస్తుంది కానీ ప్రజలకు భిన్నమైన సందేశం తీసుకెళ్తుంది.
పవార్ లను మినహాయించి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఇప్పటికీ బీజేపీ చుట్టూ అధికారం కేంద్రీకృతం అవుతోందని తెలుస్తోంది. దానికి ప్రజాదరణ దక్కడంతో పాటు ప్రతిపక్షాలు చీలికలుగా ఉండటం, ఎన్నికల వ్యయంలో వెనకాడకపోవడం, సంస్థాగతంగా బలంగా ఉండటం కలిసి వస్తున్నాయి.
Next Story

