
దక్షిణాదిలో బీజేపీ పాత్ర పెరగబోతుందా?
కేరళను తొలినాళ్ల గుజరాత్ తో మోడీ ఎందుకు పోల్చారు?
ఈ ఏడాదిలో తమిళనాడు, కేరళ అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రెండు దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి చాలాకాలంగా సరైన ప్రాతినిధ్యం లేదు. గత కొన్ని ఎన్నికల్లో ఓట్ల వాటా క్రమంగా పెంచుకుంటూ పోతోంది. దీనిని రాజకీయ శక్తిగా మల్చుకోవడానికి ఆ పార్టీ క్రమంగా సిద్ధమవుతోంది. ప్రధాని మోదీ ఈ రాష్ట్రాలలో ఈ వారంలో రెండు ఎన్నికల ర్యాలీలు తీసి, ప్రసంగించి కార్యకర్తలలో నూతనోత్సాహం నింపారు.
తిరువనంతపురం, చెన్నై సమీపంలోని మధురాంతకంలో ప్రసంగించిన మోదీ, రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వాలకు తమ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రత్యామ్నాయం అని, తమకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు.
‘ది ఫెడరల్’ ఎడిటర్ ఇన్ చీఫ్ శ్రీనివాసన్ ఈ విషయం పై మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన విధానాన్ని అర్థం చేసుకుంటే అధికారికంగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించినట్లే అని విశ్లేషించారు. దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేసేందుకు ఆయన రాజకీయ యుద్ధాన్ని తిరిగి ప్రారంభించారని చెప్పారు.
కేరళలో కథ వేరేగా ఉందా?
కేరళలో బీజేపీ క్రమంగా తన ప్రభావాన్ని పెంచుకుంటూ వస్తోంది. ‘‘గత పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్లవాటా క్రమంగా పెరిగింది. సింగిల్ డిజిట్ నుంచి ఏకంగా 20 శాతం వరకూ పెంచుకున్నారు. ’’ అని శ్రీనివాసన్ గుర్తు చేశారు.
అయితే ఎన్నికలలో వాటి శక్తి పరిమితంగానే ఉన్నాయని, పార్టీ కేవలం ఒక లోక సభ స్థానం మాత్రమే గెలుచుకుందని చెప్పారు. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ విజయం సాధించినప్పటికీ దాని ప్రభావాన్ని ఎక్కువగా ఊహించుకోకూడదని చెప్పారు. ‘‘ఇది ఇప్పటికి చిన్న అడుగే. పెద్ద కథ ఏంటంటే యూడీఎఫ్ మంచి పనితీరు, ఎల్డీఎఫ్ క్షీణత’’ అన్నారు.
1980 ప్రారంభంలో గుజరాత్ లో బీజేపీ మెల్లిగా వేసిన అడుగులను కేరళలో జరుగుతున్న వాటితో ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఉదహరించారు. ఇందులో కీలకమైన అంశాలను ప్రధాని విస్మరించారని అన్నారు.
‘‘కేరళ సామాజిక చిత్రం, రాజకీయ చరిత్ర పూర్తిగా భిన్నం. గుజరాత్, కేరళలను పోల్చడం ఆపిల్, నారింజ పండును పోల్చి చెప్పడం లాంటివి’’ అని ఆయన అన్నారు. ప్రధానమంత్రి సూచనలు వాస్తవాల కంటే పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరచడం గురించే అని ఆయన పేర్కొన్నారు.
తమిళనాడులో...
తమిళనాడులో రాజకీయ వాతావరణం మరింత గందరగోళంగా కనిపిస్తోంది. పళనిస్వామి, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఎఎంఎంకే, అన్బుమణి రామదాస్ నేతృత్వంలోని పీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ తో కలిసి ఎన్డీఏ ఏర్పాటు అయ్యాయి.
ఇది పూర్తిగా ఎన్నికల వాతావారణాన్ని మార్చివేసింది. ఇది ఒక ముఖ్యమైన రాజకీయ క్షణం అన్నారు. ఈ కూటమి పార్టీ సంప్రదాయ కుల, ప్రాంతీయ సమతుల్యతను పునరుద్దరించగలదని ఆయన పేర్కొన్నారు.
‘‘ఇది కాగితంపై బలమైన కూటమిగా కనిపిస్తోంది’’ అన్నారు. దీర్ఘకాలంగా శత్రువుగా ఉన్న పార్టీల మధ్య ఓటు బదిలీ కచ్చితంగా జరుగుతుందా అనే అనుమానం వ్యక్తం చేశారు. తమిళనాడులో ప్రధాన భాగస్వామి కాకపోయిన.. బీజేపీనే వీటికి కలిపి ఉంచిందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్థిక వికేంద్రీకరణ, గవర్నర్ల పాత్రపై వివాదాలతో సహ సమాఖ్య ఉద్రిక్తతలపై శ్రీనివాసన్ మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలు తమ పరపతిని నిలుపుకుంటున్నాయని అన్నారు.
‘‘సమాఖ్య సమస్యలు అమలులోకి వచ్చినప్పుడూ తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు చారిత్రాత్మకంగా పై చేయి సాధించాయి’’ అని ఆయన గుర్తు చేశారు. 2026 ఎన్నికలు సమీపిస్తున్న కాలంలో బీజేపీ ఏమాత్రం ఆశాజనక పరిస్థితులు లేవని, అయినప్పటికీ దీర్ఘకాలికంగా అది తను పోటీ చేస్తునే ఉంటాననే సంకేతాలు పంపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story

