
బోయింగ్ 787-8 విమానాల్లో ప్రయాణం పీడకలేనా?
అహ్మాదాబాద్ విమాన ప్రమాదం తరహాలోనే పనిచేయని ఇంధన నియంత్రణ స్విచ్ లు
రచెల్ చిత్ర
బోయింగ్ 787-8 విమానంలో లోపం ఉందని ఎయిర్ ఇండియా పైలట్లలో ఒకరు నిన్న ఫిర్యాదు చేసిన తరువాత మరోసారి బ్రోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇంధన నియంత్రణ స్విచ్ లను తనిఖీలు చేయడం ప్రారంభం అయ్యాయి.
గత సంవత్సరం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం AI- 171 ఘోర ప్రమాదంపై దర్యాప్తులో భాగంగా ఇవే తీవ్రంగా పరిశీలనకు గురైయ్యాయి. తాజా సంఘటనలో లోపాలు ఉన్న విమానం బెంగళూర్ కు చేరుకోగానే గ్రౌండ్ ఆపరేషన్ల సమయంలో ఇంధన నియంత్రణ స్విచ్ ఆశించిన విధంగా పనిచేయలేదని పైలట్ గుర్తించి ఫిర్యాదు చేశారు.
ముందు జాగ్రత్త చర్యగా విమానం నిలిపివేయబడింది. ఈ విషయాన్ని ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి చేరవేసింది.
ఇంధన నియంత్రణ స్విచ్ సమస్య
విమానం తనిఖీ తరువాత విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఎయిర్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ, ఎయిర్‌లైన్ "పైలట్ ఆందోళనలను ప్రాధాన్యతా ప్రాతిపదికన తనిఖీ చేయడానికి OEM(విమాన తయారీదారు)ని చేర్చుకుంటోంది" అని, రెగ్యులేటర్‌కు సమాచారం అందించామని ధృవీకరించారు.
DGCA ఆదేశాల తర్వాత ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787 విమానాల అంతటా ఇంధన నియంత్రణ స్విచ్‌లను తనిఖీ చేసిందని, ఆ సమయంలో ఎటువంటి సమస్యలు లేవని, ప్రయాణీకులు, సిబ్బంది భద్రతే ఎయిర్‌లైన్స్ ప్రధాన ప్రాధాన్యత అని పునరుద్ఘాటించిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
ఇంధన నియంత్రణ స్విచ్‌లు విమాన ఇంజిన్‌లకు ఇంధన ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. సాధారణ కార్యకలాపాల సమయంలో RUN స్థానంలో పైలెట్ల ఆదేశాలకు అనుగుణంగా లాక్ చేయబడేలా రూపొందించారు.
CUTOFFకి స్విచ్‌ను తరలించడం వలన ఇంజిన్‌కు ఇంధన సరఫరా నిలిచిపోతుంది. ఇంజిన్ స్టార్ట్ చేసిన సమయంలో ల్యాండ్ చేసినప్పుడు మాత్రమే ఈ స్విచ్‌లను ప్రధానంగా ఉపయోగిస్తారు.
జూన్ 12, 2025న ఎయిర్ ఇండియా విమానం AI-171 క్రాష్ అయినప్పటి నుంచి వాటి పనితీరుపై దర్యాప్తు సంస్థలు తీవ్ర దృష్టి కేంద్రీకరించాయి. గత ఏడాది జరిగిన ఈ ప్రమాదంలో 260 మంది మరణించారు.
రాజ్యసభలో ప్రభుత్వం స్పందన
గత సంవత్సరం ఎయిర్ ఇండియా క్రాష్‌కు గల అన్ని ప్రధాన కారణాలను కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా అధ్యయనం చేస్తున్నట్లు ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది.
ఈ వారం ప్రారంభంలో రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) సాంకేతిక, కార్యాచరణ, మానవ అంశాలతో సహా సాధ్యమైన ప్రతి అంశాన్ని పరిశీలిస్తోందని, దర్యాప్తు పూర్తయిన తర్వాతే తీర్మానాలు తీసుకుంటామని తెలిపింది.
అంతర్జాతీయ విమానయాన నిబంధనలకు అనుగుణంగా విచారణ జరుగుతోందని, భద్రతా సిఫార్సులు ఏవైనా ఉంటే, ఆధారాలు, విశ్లేషణల ఆధారంగా జారీ చేస్తారని ప్రభుత్వం పేర్కొంది.
దర్యాప్తుపై నిరంతర ప్రజా, చట్టపరమైన పరిశీలన జరుగుతున్న సందర్భంలో ఈ ప్రకటన వచ్చింది. కానీ కొంతమంది ఏవియేషన్ నిఫుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఎంపిక చేసిన అంశాలపై లీకులు ఇస్తున్నారని, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మాత్రం రావడం లేదని అంటున్నారు.
AI 171 మరియు ఇంధన స్విచ్ చర్చ
VT-ANBగా నమోదు కాబడ్డ బోయింగ్ 787-8 అయిన AI 171, అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని సెకన్ల తర్వాత క్రాష్ అయింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) తన ప్రాథమిక నివేదికలో, రెండు ఇంజిన్లకు ఇంధన నియంత్రణ స్విచ్‌లు లిఫ్ట్-ఆఫ్ అయిన కొద్దిసేపటికే RUN నుంచి CUTOFFకి మారినట్లు కనుగొంది.
దీని ఫలితంగా థ్రస్ట్ లభించక విమానం అమాంతంగా నేల కూలింది. కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో ఒక పైలట్ మరొక పైలట్‌ను ఇంజిన్లు ఎందుకు ఆఫ్ చేశావ్ అని అడుగుతున్నట్లు రికార్డు చేయబడింది.
ప్రతిస్పందన ఉద్దేశపూర్వకంగా జరగలేదని సాంకేతిక సమస్య ఉందని సూచిస్తుంది. స్విచ్ కదలికలు పైలట్ చర్య, యాంత్రిక ప్రవర్తన, విద్యుత్ సంఘటనలు లేదా ఇతర సిస్టమ్ పరస్పర చర్యల ఫలితమా అని AAIB ఇంకా తేల్చలేదు. తుది నివేదిక కోసం వేచి చూస్తున్నారు.
ప్రాథమిక నివేదిక విడుదలైనప్పటి నుంచి, ఇంధన నియంత్రణ స్విచ్‌లు ప్రజలు, మీడియా చర్చకు కేంద్ర బిందువుగా మారాయి, కొన్ని నివేదికలు పైలట్ చర్య వైపు మొగ్గు చూపగా, సాంకేతిక నిపుణులు పైలట్ గ్రూపులు సహా మరికొందరు పూర్తి డేటాసెట్‌ను బహిర్గతం చేసే ముందు తీర్మానాలు చేయవద్దని హెచ్చరించారు.
ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి..
AI 132 సంఘటన AI 171 క్రాష్‌కు ప్రత్యక్ష సంబంధాన్ని లేదని నిఫుణులు చెబుతున్నారు. అయితే, కీలకమైన ఇంజిన్ నియంత్రణ వ్యవస్థకు సంబంధించిన పైలట్లు నివేదించిన ఏదైనా అసాధారణ ప్రవర్తనను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు.
ప్రత్యేకించి అదే భాగం కొనసాగుతున్న ప్రాణాంతక ప్రమాద దర్యాప్తులో ప్రముఖంగా కనిపిస్తుంటే, AI 171కి సంబంధించిన సాంకేతిక డేటాను విశ్లేషిస్తున్న లాభాపేక్షలేని ఏవియేషన్ సేఫ్టీ గ్రూప్ అయిన ‘సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్’కు చెందిన కెప్టెన్ అమిత్ సింగ్ మాట్లాడుతూ, ఒకే వ్యవస్థపై పదే పదే శ్రద్ధ చూపడం పారదర్శకత, సమగ్ర పరీక్షల అవసరాన్ని నొక్కి చెబుతుందని అన్నారు. సుప్రీంకోర్టులో ఎయిర్ ఇండియా 171 కేసు కోసం కెప్టెన్ సుమీత్ సభర్వాల్ తండ్రి పుష్కరాజ్ సభర్వాల్‌తో పాటు కెప్టెన్ అమిత్ సింగ్ కూడా పిటిషన్లు దాఖలు చేశారు.
"ఇంధన నియంత్రణ స్విచ్‌లు విమానంలో అధిక-ఫ్రీక్వెన్సీ పైలట్ ఇన్‌పుట్‌లు కావు" అని సింగ్ క్రాష్ దర్యాప్తుపై మునుపటి ప్రకటనలో తెలిపారు. "ఇంజిన్ ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడిన ఏదైనా సందర్భాన్ని విమాన వ్యవస్థలు, విద్యుత్ స్థిరత్వం, విమాన నియంత్రణ పూర్తి సందర్భంలో పరిశీలించాలి, ఒంటరిగా కాదు." అని ఆయన చెబుతుననారు.
టేకాఫ్‌కు ముందు నిమిషాల్లో AI 171 ద్వారా ప్రసారం చేయబడిన బహుళ విద్యుత్, వ్యవస్థ లోపాలను ఎత్తి చూపింది, క్యాస్కేడింగ్ సిస్టమ్ ప్రభావాలు ఇంజిన్ ప్రవర్తనను ప్రభావితం చేసి ఉండవచ్చా అనే ప్రశ్నలను లేవనెత్తింది.
ఆ సమస్యలను ‘ది ఫెడరల్’ ఇంతకుముందు వరుసగా కథనాలను ప్రసారం చేసింది. ఇది బయలుదేరే ముందు అహ్మదాబాద్‌లో కూలిపోయిన విమానంలో ముందుగా ఉన్న విద్యుత్ సరఫరాలోని అంతరాయాన్ని హైలైట్ చేసింది.
AI 171 క్రాష్‌పై సుప్రీంకోర్టులో కేసు
AI 171 దర్యాప్తు న్యాయపరమైన పరిశీలనలో ఉన్నప్పటికీ ఇంధన నియంత్రణ స్విచ్‌లపై పునరుద్ధరించబడిన విషయం దృష్టి వచ్చింది. ఈ విషయం ప్రస్తుతం భారత సుప్రీంకోర్టు ముందు ఉంది, ఇక్కడ AI 171 క్రాష్‌పై రెండు వేర్వేరు పిటిషన్లు విచారణలో ఉన్నాయి.
ఒక పిటిషన్‌ను వాణిజ్య విమానయాన పైలట్ కెప్టెన్ అమిత్ సింగ్ దాఖలు చేయగా, మరొక పిటిషన్‌ను AI171 పైలట్ సుమీత్ సభర్వాల్ తండ్రి వేయగా, మరొకటి భారత పైలట్ల సమాఖ్య దాఖలు చేసింది. వారు సాంకేతిక డేటాను బహిర్గతం చేయాలని, దర్యాప్తు దిశపై స్పష్టత ఇవ్వాలని, స్వతంత్ర న్యాయ విచారణను కోరుతున్నారు.
నవంబర్ 13, 2025న జరిగిన మునుపటి విచారణలో, పిటిషనర్లు లేవనెత్తిన నిర్దిష్ట అంశాలపై స్పందించాలని ప్రభుత్వం మరియు విమానయాన అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ కోర్టు నిర్దేశించిన గడువు అయిన డిసెంబర్ 13, 2025 నాటికి సుప్రీంకోర్టు ఆదేశాలకు ప్రభుత్వం స్పందించలేదు.
జనవరి 28, 2026న జరిగిన తాజా విచారణలో, ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రాతినిధ్యం కోర్టులో లభించలేదు. సేఫ్టీ మ్యాటర్ అనే ఎన్జీఓ తరపున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టులొ వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం లేదా ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ (AAIB) ఈ పిటిషన్‌కు స్పందించలేదని అన్నారు. "వేల మంది పైలట్లు బోయింగ్ 787 విమానంలో విద్యుత్ లోపాలను ఎత్తి చూపారు" అని అన్నారు. తదుపరి విచారణకు కోర్టు ఇంకా తేదీ ఇవ్వలేదు.
ఎయిర్ ఇండియా తనిఖీలు
AI 132 నివేదిక తర్వాత DGCA కొత్త ఆదేశాన్ని జారీ చేయలేదు, అయినప్పటికీ అధికారులు ఎయిర్ ఇండియా తనిఖీల ఫలితాలను సమర్పించిన తర్వాత వాటిని సమీక్షిస్తారని భావిస్తున్నారు.
ఈ ప్రక్రియ గురించి తెలిసిన వర్గాల సమాచారం ప్రకారం, ముందు జాగ్రత్త చర్యగా ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ ఫ్లీట్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏవైనా ఫలితాలను తదుపరి దశ కోసం రెగ్యులేటర్, విమాన తయారీదారుతో పంచుకుంటారు.
Next Story

