
తాటిపర్తి జీవన్ రెడ్డి
తాటిపర్తి జీవన్ రెడ్డి అసంతృప్తికి మూలం ఏమిటి?
రాజకీయ నైతికత vs అవకాశవాదం.జీవన్ రెడ్డి రాజకీయ నిర్ణయం ఒక విశ్లేషణ
తెలంగాణ రాజకీయాల్లో ఇటీవలి పరిణామాలు కేవలం పార్టీల మార్పులు కాదు…అవి నాయకత్వ విలువలు, నైతికత, వ్యక్తిత్వం, ప్రజల విశ్వాసం అనే నాలుగు ప్రధాన స్తంభాలపై పరీక్ష వేస్తున్న సంఘటనలు.
ఈ నేపథ్యంలో తాటిపర్తి జీవన్ రెడ్డి నిర్ణయం ఒక వ్యక్తిగత రాజకీయ మార్పు మాత్రమే కాదు — అది ఒక రాజకీయ తత్వానికి సంబంధించిన పరీక్షగా మారింది. ఒక నాయకుడు దశాబ్దాల పాటు ఒక పార్టీకి సేవ చేసి, అదే పార్టీ మీద విమర్శలు చేస్తూ, చివరకు వేరే దారిని ఎంచుకోవడం…ఇది సాధారణ రాజకీయ కదలిక కాదు.ఇది ప్రజలు గమనించే ఒక “వ్యక్తిత్వ పరివర్తన”.ఈ వ్యాసంలో మనం ఈ అంశాన్ని భావోద్వేగంతో కాదు —లోతైన రాజకీయ, సామాజిక, మానసిక విశ్లేషణతో పరిశీలిద్దాం.
విశ్వాసం నుండి విరక్తి వరకు
టీ.జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఒక సాధారణ నాయకుడి కథ కాదు.అది క్రమంగా ఎదిగిన, పోరాడిన, విశ్వాసం సంపాదించిన నాయకుడి గాధ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఆయన ఎదుగుదల, స్థానిక స్థాయిలో ప్రజలతో కలిసిపోయిన తీరు, పార్టీ పట్ల చూపిన నిబద్ధత — ఇవన్నీ కలిపి ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపును ఇచ్చాయి. అయితే ప్రతి నాయకుడి జీవితంలో ఒక దశ వస్తుంది: “నేను చేసిన కృషికి సరైన గుర్తింపు దొరుకుతోందా? ఈ ప్రశ్నకు సమాధానం రాకపోతే, అది అసంతృప్తిగా మారుతుంది. అసంతృప్తి కోపంగా మారుతుంది. కోపం నిర్ణయంగా మారుతుంది.ఇది జీవన్ రెడ్డి విషయంలో కూడ కనిపిస్తున్న అసలు సిసలైన అసంతృప్తి ...
నాయకత్వం అంటే - పదవులేనా?
ఒక నాయకుడు పదవులు పొందడం సాధారణం. ఎన్నికల్లో గెలవడం కూడా సాధారణమే. కానీ నిజమైన నాయకత్వం ఏమిటంటే పదవి లేకపోయినా ప్రజల మధ్య నిలబడగలగడం, జీవన్ రెడ్డి అయిదు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ప్రయాణం కేవలం గెలుపుల కథ కాదు…అది ఓటములను ఎదుర్కొని, తిరిగి లేచి, ప్రజలతో మమేకమైన ఒక ప్రయాణం.అయితే ఈ రోజు ఆయన ముందున్న ప్రశ్న, “నాకు న్యాయం జరిగిందా? కాదు...నేను ఏ నిర్ణయం తీసుకుంటే నా విలువలు నిలుస్తాయి? అనేది. ఇది ఒక పెద్ద తేడా. ఈ తేడా గుర్తించగల నాయకుడే చరిత్రలో నిలుస్తాడు.
సిద్ధాంతం vs సమీకరణాలు
ఇప్పటి రాజకీయాల్లో ఒక చేదు నిజం ఉంది. సిద్ధాంతాలు మాటల్లో ఉంటాయి… నిర్ణయాలు సమీకరణాల్లో ఉంటాయి.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం కొత్త విషయం కాదు. అదే విధంగా గతంలో భారత్ రాష్ట్ర సమితి కూడా ఇదే విధానాన్ని అనుసరించింది, ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో. కానీ ఇక్కడ కీలకమైన తేడా ఉంది,అప్పట్లో BRS బలంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ సున్నితమైన స్థితిలో ఉంది. అంటే కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు వ్యూహాత్మక అవసరంగా కనిపిస్తున్నాయి.కానీ పాత నాయకులకు అవి “అవమానం”గా అనిపిస్తున్నాయి. ఇదే జీవన్ రెడ్డి అసంతృప్తికి మూలం
విమర్శల నుండి మార్పు వరకు
ఇది ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు…ఇది ఒక వ్యక్తిత్వ పరీక్ష, ఒక నైతిక పరీక్ష, ఒక చరిత్రాత్మక నిర్ణయం. అతని ముందు రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవడం. లేదా మళ్ళీ కాంగ్రెస్ లో కొనసాగడం ఇదీ మాత్రం→ కష్టం కానీ గౌరవం. రాజకీయాల్లో ఒక ప్రధాన సూత్రం ఉంది. మీ మాటలు మీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంటే, ప్రజలు మీ మీద నమ్మకం కోల్పోతారు. జీవన్ రెడ్డి గతంలో BRS విధానాలను విమర్శించారు. ఇప్పుడు అదే పార్టీకి వెళితే ప్రజలు ఏలా ఆలోచిస్తారు. అప్పుడు చెప్పింది అబద్ధమా ? ఇప్పుడు తీసుకున్న నిర్ణయం స్వార్థమా? ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ప్రజల నమ్మకం కోల్పోవడం అంటే రాజకీయంగా , వ్యక్తిత్వంగా నష్టపోవడం, భవిష్యత్తులో అవకాశాలు తగ్గిపోవడం.
BRS లో అవకాశాలు
భారత్ రాష్ట్ర సమితి లోకి వెళ్లడం తాత్కాలికంగా ఆకర్షణీయంగా కనిపించవచ్చు.కానీ లోతుగా చూస్తే, ఇప్పటికే అక్కడ బలమైన నాయకత్వం ఉంది.కొత్తగా వచ్చిన వారికి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉండదు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రాధాన్యం ఉండే అవకాశం. ఇంకా ఒక ముఖ్యమైన అంశం BRS ప్రస్తుతం అధికారంలో లేదు. అంటే రాజకీయ భవిష్యత్తు అనిశ్చితంగా ఉంటుంది.
BJP – కొత్త దారి కానీ ...
భారతీయ జనతా పార్టీ ఒక విస్తరణ దశలో ఉంది. జీవన్ రెడ్డి BJP లోకి వెళితే,కొత్త నాయకులకు అవకాశం, వ్యక్తిగత గుర్తింపు పెరుగుతుంది, రాష్ట్రంలో పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించవచ్చుకానీ
స్థానిక స్థాయిలో బలహీనత, ఎన్నికల్లో గెలుపు గ్యారంటీ లేదు. సిద్ధాంత మార్పు విమర్శలు.అయితే ఇది ఒక ప్రమాదకరమైన కానీ గౌరవప్రదమైన మార్గం.
కాంగ్రెస్‌లోనే కొనసాగితే ....
ఇది కష్టమైన మార్గం… ఇప్పటికే రాజీనామా. చేయడం చూశాం.కానీ ఇంకెన్నాళ్ళు ఎదురుచూస్తే అత్యంత గౌరవప్రదంగా ఉండి ఉండేది. పార్టీలోనే ఉండి తన అభిప్రాయాలను బలంగా వ్యక్తపరచడం, అంతర్గతంగా పోరాడటం, తన అనుచరులను బలోపేతం చేయడం ద్వారా ఆయన ఒక “స్థిరమైన నాయకుడు”గా నిలుస్తారు. భవిష్యత్తులో పెద్ద అవకాశాలు వస్తాయి. ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుంది.
ప్రజల దృష్టిలో నాయకత్వం:
మార్పు కాదు, స్థిరత్వం ముఖ్యం. ఈరోజు ఓటర్లు చాలా అవగాహనతో ఉన్నారు.వాళ్లు ఇలా చూస్తారు. ఎన్ని పార్టీలు మారాడు? ఎందుకు మారాడు? తన మాటలకు కట్టుబడి ఉన్నాడా?స్థిరత్వం ఉన్న నాయకుడిని ప్రజలు గౌరవిస్తారు. మారుతూ ఉండే నాయకుడిని ఉపయోగించుకుంటారు కానీ నమ్మరు చరిత్ర చెప్పే పాఠం. తెలంగాణ రాజకీయ చరిత్రలో చాలా మంది నాయకులు పార్టీలు మార్చారు. కానీ గుర్తుంచుకోండి, పార్టీ మారిన వారిలో కొంతమంది ఎదిగారు, చాలా మంది కనుమరుగయ్యారు. ఎందుకు ? కారణం ఒక్కటే — నమ్మకం. జీవన్ రెడ్డి ఏ నాయకుడిగా గుర్తుండాలి? అవకాశవాది? లేక నిబద్ధత కలిగిన నాయకుడు చివరిగా రాజకీయాల్లో గెలుపు ఓటములు మారుతూ ఉంటాయి… కానీ వ్యక్తిత్వం ఒకసారి కోల్పోతే తిరిగి సంపాదించడం చాలా కష్టం. జీవన్ రెడ్డి నిర్ణయం ఆయన భవిష్యత్తును మాత్రమే కాదు…ఆయన చరిత్రను కూడా నిర్ణయిస్తుంది.
Next Story

