
జీవన్ రెడ్డి పార్టీ మార్పు రాజకీయమా, విలువల పతనమా?
నిబద్ధత నుండి అనుమానాల దిశగా ఒక సీనియర్ నాయకుడి ప్రయాణం
తెలంగాణ రాజకీయాల్లో నలభై ఏళ్లకుపైగా కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయం—పార్టీకి రాజీనామా చేసి భారతీయ జాతీయ కాంగ్రెస్ నుంచి బయటకు రావడం, మరియు గతంలో తీవ్రంగా విమర్శించిన తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం BRS) వైపు అడుగులు వేస్తున్నట్టు వార్తలు రావడం, ఆ వార్తలను ఖండించకపోవడం, పైగా కెసిఆర్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ కామెంట్లు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. —ఇది సాధారణ రాజకీయ పరిణామం కాదు. ఇది ఒక వ్యక్తి జీవితకాల సిద్ధాంతాలపై నైతిక విలువలపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తే ఘట్టం.
పార్టీ కంటే వ్యక్తి పెద్దవాడా?
ఈ ప్రశ్న సాధారణం కాదు. ఇది ఒక నాయకుడిని మాత్రమే కాదు—మొత్తం రాజకీయ వ్యవస్థను పరీక్షించే ప్రశ్న. సూటి సమాధానం, ఆదర్శ రాజకీయాల్లో — పార్టీ పెద్దది. ప్రాక్టికల్ రాజకీయాల్లో — చాలా సార్లు వ్యక్తే పెద్దవాడవుతాడు. ఇక్కడే సమస్య మొదలవుతుంది. నాలుగు దశాబ్దాల నిబద్ధత ఒక బ్రాండ్ నిర్మాణం,,జీవన్ రెడ్డి పేరు అంటే కాంగ్రెస్ పార్టీకి అంకితభావం, సిద్ధాంతపరమైన రాజకీయాలు, ప్రాంతీయ నాయకత్వం.నాలుగు దశాబ్దాలు ఒకే పార్టీలో ఉండటం అంటే కేవలం రాజకీయ ప్రయాణం కాదు—ఒక “బ్రాండ్” నిర్మాణం. కాంగ్రెస్‌తో దీర్ఘకాల అనుబంధం,అనేక పదవులు స్థానిక స్థాయిలో బలమైన కేడర్ నిర్మాణం,ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఎదగనివ్వకపోవడం అనే విమర్శలు ఆదినుంచే వినిపిస్తున్నాయి. ఇక్కడే అతని పై మొదటి విరోధాభావం కనిపిస్తుంది. ఇక్కడే అసలు ప్రశ్న పార్టీని బలపరచే వాడు — నాయకుడు, పార్టీని వాడుకునే వాడు — రాజకీయవాది, ఈ రెండింటి మధ్య తేడా చాలా సూక్ష్మం… కానీ ప్రభావం చాలా పెద్దది. పార్టీ కంటే వ్యక్తి పెద్దవాడిగా మారినప్పుడు— రాజకీయాలు సేవ నుండి స్వార్థంగా మారుతాయి. పార్టీ కంటే వ్యక్తి పెద్దవాడైతే— ప్రజాస్వామ్యం చిన్నదవుతుంది.”
విలువలు vs అవకాశవాదం
జీవన్ రెడ్డి గతంలో TRS/BRS పై చేసిన విమర్శలు,“అహంకార రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ముప్పు, “కుటుంబ ఆధిపత్యం” అంటూ కామెంట్లు చేయడం మనకు తెలిసిందే ! మళ్ళీ అదే వ్యక్తి అటువంటి పార్టీ వైపు వెళ్లడం వల్ల ప్రజల్లో సహజంగా వచ్చే సందేహాలు, ఇన్నాళ్లు చెప్పింది అబద్ధమా? లేక ఇప్పుడు చేస్తున్నది అవకాశవాదమా? రాజకీయాల్లో పార్టీ మార్పు కొత్తది కాదు. కానీ విలువలు బోధించిన నాయకుడు మారితే ప్రభావం మరింత గట్టిగా ఉంటుంది.70 ఏళ్ల తర్వాత కూడా అవకాశాలపై పట్టుబడడం, టిక్కెట్ రాకపోతే పార్టీపై విమర్శలు, అదే నియోజకవర్గంలో కొత్త నాయకులు ఎదగకుండా అడ్డుకోవడం, ఇవి మూడు ముఖ్యమైన సంకేతాలు ఇస్తాయి, వ్యక్తిగత ఆధిపత్య రాజకీయాలుఒక నాయకుడు ప్రాంతాన్ని “సొంతం”గా భావించడం ,పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం లోపం, కాంగ్రెస్‌లో స్థానిక స్థాయిలో అసంతృప్తి, స్వీయ అహం vs పార్టీ నిర్ణయం, ఇక్కడ నుంచి పార్టీ మార్పు మొదలవుతుంది. చాలా సందర్భాల్లో పార్టీ మార్పు సిద్ధాంతాల వల్ల కాదు—టిక్కెట్ వల్లే జరుగుతుంది. ప్రజల దృష్టిలో ఈ నిర్ణయం, ఇప్పుడు అసలు కీలకమైన అంశం, ప్రజలు ఏమనుకుంటున్నారు?ప్రజల భావజాలం మూడు విధాలుగా విభజించవచ్చు, నమ్మకద్రోహంగా చూసే వర్గం “ఇన్నాళ్లు మోసం చేశాడు. స్వార్థం కోసం వెళ్లాడు” ప్రాగ్మాటిక్‌గా చూసే వర్గం, రాజకీయాల్లో ఇది సహజం” గెలవడానికి మార్పు అవసరం” వ్యక్తిగత అభిమానులు, ఎక్కడ ఉన్నా మాకు ఆయనే నాయకుడు” కానీ గమనించాల్సిన విషయం,మధ్య తరగతి, అవగాహన ఉన్న ఓటర్లు ఎక్కువగా మొదటి వర్గంలో ఉంటారు.
గతంలో చెప్పిన విలువలు ఎక్కడ?
ఇక్కడ ఒక గంభీరమైన ప్రశ్న ఉంది, “ఇది స్వార్థమా? లేక పరిస్థితుల ప్రభావమా?జీవన్ రెడ్డి గతంలో చెప్పిన విలువలు,నీతి, నిజాయితీ, ప్రజాస్వామ్యం...అవి ఇప్పుడు కూడా వర్తిస్తాయా? లేక పరిస్థితులకు అనుగుణంగా మారాయా? ప్రజలు ఈ ప్రశ్నకు సమాధానం కోరుతున్నారు.ఈ సంఘటన ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం కాదు.తెలంగాణ రాజకీయ సంస్కృతి పై ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ఇది పెద్ద సమస్యను చూపిస్తుంది, సిద్ధాంతాలు క్షీణిస్తున్నాయా? వ్యక్తిగత ప్రయోజనాలు పెరుగుతున్నాయా?ప్రజల నమ్మకం తగ్గుతున్నదా? ఇది ప్రమాదకర సంకేతం.తాటిపర్తి జీవన్ రెడ్డి నిర్ణయం ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది, రాజకీయాల్లో నమ్మకం కంటే అవకాశాలు పెరుగుతున్నాయి. విలువలు కంటే లాభాలు ముందుకు వస్తున్నాయి. ప్రజలు ఇక మౌనంగా ఉండడం లేదు. రాజకీయాల్లో మాటలకు ఒక నైతిక బరువు ఉంటుంది. నీతి, నిజాయితీ, విలువలు అంటూ ప్రజల ముందు నిలిచిన నాయకుడు, అదే విలువలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటే అది సాధారణ పార్టీ మార్పుగా కనిపించదు—ఒక నమ్మక విరామంగా అనిపిస్తుంది. తాటిపర్తి జీవన్ రెడ్డి వంటి అనుభవజ్ఞుడి విషయంలో ఈ విరోధాభాసం మరింత గట్టిగా ప్రతిధ్వనిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఆయన మాటలను కేవలం రాజకీయ వ్యాఖ్యలుగా కాకుండా, ఒక స్థిరమైన నైతిక ధోరణిగా స్వీకరించారు. ముఖ్యంగా నేటి యువత, మహిళా ఓటర్లు భావోద్వేగాల కంటే స్థిరత్వాన్ని, నిజాయితీని ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకే ఇలాంటి మార్పులు వారికి అసౌకర్యంగా, అనిశ్చితంగా అనిపిస్తాయి. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తీసుకున్న అడుగు ప్రజల దృష్టిలో అవకాశవాదంగా మారుతుంది. ఒకసారి ఆ భావన స్థిరపడితే, దాన్ని తొలగించడం చాలా కష్టం. ఎందుకంటే అది ఒక సంఘటన కాదు—ప్రజల మనసులో ఒక తీర్పు.
BRS లోకి వెళ్లితే - హీరోనా? జీరోనా?
ఇది పూర్తిగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది, మొదటిది వెంటనే రాజకీయ లాభం వస్తే → హీరో
పదవి వస్తే, ఎన్నికల్లో గెలిస్తే,,ప్రాభవం పెరిగితే లేదా ఉపయోగించుకొని పక్కన పెడితే → కొత్త నాయకత్వం ప్రాధాన్యం పెరిగితే,, టిక్కెట్ రాకపోతే, గౌరవం తగ్గితే జీరో అవుతాడు.
తర్వాత మధ్యస్థితి, వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతింటుంది. కానీ రాజకీయంగా కొనసాగుతాడు, రాజకీయాల్లో “హీరో” లేదా “జీరో” అనేది ప్రజల—ఫలితాలు నిర్ణయిస్తాయి.జీవన్ రెడ్డి ఈ మార్పు తీసుకోవడానికి మూడు కారణాలు ఉండవచ్చు, ఇది ప్రజల ప్రయోజనమా?, వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు, పార్టీ లోపలి అసంతృప్తి, ప్రస్తుత రాజకీయ సమీకరణాలు , కానీ ప్రజల దృష్టిలో ఒకే ప్రశ్న, మా కోసం చేశారా? లేక మీ కోసం చేశారా?”
ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వకపోతే ఏ నాయకుడైనా విశ్వాసాన్ని కోల్పోతాడు. తాటిపర్తి జీవన్ రెడ్డి జీవితంలో ఇది ఒక కీలక మలుపు. 40 ఏళ్ల కృషి ఒక నిర్ణయంతో ప్రశ్నార్థకమవుతుంది. విలువలు vs అవకాశవాదం అనే చర్చ మొదలవుతుంది. ప్రజలు తీర్పు చెప్పే సమయం దగ్గర పడుతుంది. రాజకీయాల్లో పార్టీ మార్పు తప్పు కాదు. కానీ విలువలను మార్చడం—కానీ ప్రజల నమ్మకం కోల్పోతే—అది తిరిగి రాదు. అదే ప్రజలు క్షమించరు సుమా !
Next Story

