
‘హమాస్’ దాడి తరువాత ఇజ్రాయెల్ లో ఏం మారింది?
నేటీతో పాశవిక దాడికి మూడేళ్లు, గాజాలో ఉగ్రవాదులతో సహ డెబ్బై నాలుగు వేల మంది మృతి
రెండో ప్రపంచ యుద్ధం తరువాత నుంచి గాజా ఓపెన్ జైలులా మారింది. ఇజ్రాయెల్ దానిని దిగ్భంధించి, కఠినంగా నియంత్రిస్తోంది. ఏ మాత్రం అనుమానం వచ్చిన ఎప్పటికప్పుడూ దాడులు చేసేది. అక్టోబర్ 7, 2023న జరిగిన పాశవిక హమాస్ దాడి కంటే ముందే ఆ ప్రాంత ప్రజలు కఠినమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు.
పాలస్తీనా ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో భారీ నిరుద్యోగం ప్రబలింది. ఇక్కడ దాదాపు 20 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు. వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. అయితే మూడు సంవత్సరాల క్రితం జరిగిన దాడితో దాని బలహీనత ఒక్కసారిగా బయటపడింది. సుమారు 1200 మంది అమాయక యుదులు హమాస్ తీవ్రవాదుల చేతిలో దారుణంగా చంపబడ్డారు. మరో 250 మందిని బందీలుగా పట్టుకెళ్లారు.
మొస్సాద్.. షిన్ బెట్ ఎక్కడ విఫలం అయ్యాయి..
ఇజ్రాయెల్ ఒక కట్టుదిట్టమైన భద్రత ఉన్న దేశం. చుట్టూ ఉన్న ఉగ్రవాద దేశాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానికి, నిఘాను జోడించి పహరా కాస్తుంటారు. అయితే ఇంత పరిజ్ఞానం ఉనప్పటికీ షిన్ బెట్, మొస్సాద్ రెండు కూడా అక్టోబర్ ఏడు నాటి దాడులను పసిగట్టడంలో విఫలం అయ్యాయి.
గాజా స్ట్రిప్ లో నిత్యం ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించే పాలస్తీనియన్లను అణచివేయడానికి ఇజ్రాయెల్ గట్టి నిఘాను కొనసాగించేది. దీనితో వారు అక్టోబర్ 7 నాటి దాడులు వస్తాయని ఊహించలేకపోయారు. కొన్ని ఆశ్చర్యంగా అనిపించినా ఇజ్రాయెల్ నిఘా వర్గాలు ‘జెరిఖో వాల్’ అనే సంకేతనామం తో ఏదో దాడులకు ప్రణాళిక జరుగుతోందని నిఘా వర్గాలు సంవత్సరం ముందే గుర్తించాయి.
40 పేజీల ఆ పత్రాలలో దక్షిణ ఇజ్రాయెల్ పై అనేక దాడులకు సబంధించిన సవివర ప్రణాళిక వారికి అందింది. ఇందులో మొదట రాకెట్లను ప్రయోగించడం, సరిహద్దులో కెమెరాలపై డ్రోన్ లను ఉపయోగించడం, ఇజ్రాయెల్ ను బందీలుగా పట్టుకెళ్లడం వంటివి ఉన్నాయి. అయితే ఆ దాడి ఎప్పుడు జరుగుతుందో మాత్రం ఊహించలేకపోయారు.
హమాస్ ను తప్పుగా అంచనా...
సమాచారం వారికి అందినప్పటికీ హమాస్ దీన్ని అమలు చేస్తుందని మాత్రం నిఘా అధికారులు ఊహించలేకపోయారు. కేవలం గాజాను నియంత్రించడానికే వారు ఆసక్తి చూపుతున్నారని భావించారు. 2006 తరువాత అక్కడ ఎన్నికలు జరగలేదు.
పాలస్తీనా అథారిటీని పాలిస్తున్న లౌకిక రాజకీయ పార్టీ అయిన ఫతాను గాజా నుంచి వెళ్లగొట్టడానికి దారితీసింది. జూన్ 2007 నాటికి హమాస్ పూర్తిగా గాజాపై పట్టుబిగించింది. ఈ పరిణామంపై టెల్ అవీవ్ సంతోషపడింది. గాజాలో హమాస్ కు బలం చేకూర్చడంతో వెస్ట్ బ్యాంక్ లో పాలస్తీనా అథారిటి బలహీనపడుతుందని, ఇది జియోనిస్ట్ ఉద్యమానికి ప్రయోజనం చేకూరుస్తుందని భావించింది.
భారత్ లోని పాలస్తీనా రాయబారీ అబ్దుల్లా మహ్మద్ అబు పవేశ్ ప్రకారం.. ‘‘గాజాకు గణనీయమైన ఆర్థిక సాయం అందించాలని, నెతాన్యాహూ అధికారికంగా ఖతార్ ను అభ్యర్థించారు. ’’ అని చెప్పారు.
నెతాన్యాహూ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హమాస్ ను నియంత్రించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. గాజాను నిర్వహించడం వల్ల యుద్ధం పెద్ద స్థాయికి వెళ్లవచ్చని అనుకున్నారు. కానీ హమాస్ దాడితో ఆయన ప్రణాళిక మొత్తం చిన్నాభిన్నం అయింది.
అక్టోబర్ 7 వైఫల్యం...
అక్టోబర్ 7న ఇజ్రాయెల్ దేశం వైఫల్యం కూడా ఇదే. ఇంతకుముందే చెప్పినట్లే సమాచారం ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోలేదు. దాడికి కొద్ది నిమిషాల వరకూ సమాచారం ఉన్నప్పటికీ పూర్తి అప్రమత్తతో ఉంచలేదు. అక్టోబర్ 7 వ తేదీకి ముందే నెతన్యాహూ ఈజిప్టు, ఎమిరేట్స్ నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు అందాయని వచ్చిన నివేదికలు ఈ చర్చకు మరో కోణాన్ని జోడించాయి.
ఇజ్రాయెల్ లోని ప్రముఖ పత్రిక అయిన ‘హార్జెట్’ లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. హమాస్ గురించి పూర్తి సమాచారం యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయోద్, నెతాన్యాహూను ముందే హెచ్చరించారని పేర్కొంది. అయితే దాన్ని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఖండించింది.
యుద్ధ మూల్యం...
అక్టోబర్ 7 నాటి ప్రతీకార చర్య ఇజ్రాయెల్ సైనిక శక్తికి, క్రూరత్వానికి ఒక నమూనాగా నిలిచింది. యూదు రాజ్యాన్ని సవాల్ చేస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ప్రత్యక్షంగా చూపించింది. గాజా మొత్తం శిథిలాల దిబ్బగా మారింది. హమాస్ తీవ్రవాదులతో పాటు 74 వేల మంది మరణించారు.
ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న దాడుల వీడియోలు ప్రపంచవ్యాప్తంగా ప్రసారం కావడంతో దానిమీద ఉన్న సానుభూతి మొత్తం ఆవిరి అయింది. ఇజ్రాయెల్, జెనివా నిబంధనలు ఉల్లంఘిస్తోందని, జాతి నిర్మూలనకు పాల్పడుతోందని పేర్కొంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నెతన్యాహూపై అభియోగాలు మోపి, ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇజ్రాయెల్ తన స్నేహితులను కోల్పోయింది. అమెరికాలోనూ అనేక వర్గాల నుంచి మద్దతును కోల్పోయింది.
దౌత్య పరిణామాలు..
దౌత్యపరంగా కూడా అది తగిన మూల్యం చెల్లించింది. డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ మధ్యవర్తిత్వం వహించిన అబ్రహమిక్ అకాడమిక్ లక్ష్యం.. ఇజ్రాయెల్ కు చట్టబద్దత కల్పించడమే. 2020 లో ఇజ్రాయెలో తో సాధారణ సంబంధాలను నెలకొల్పడానికి యూఏఈ, బహ్రెయిన్ మొదటగా సంతకాలు చేశాయి. తరువాత మొరాకో, సూడాన్, కజకిస్తాన్ కూడా ఇదే బాటలో నడిచాయి.
తరువాత గల్ఫ్ లో అతి శక్తివంతమైన సౌదీ అరేబియా కూడా దానిపై సంతకం చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. కానీ హమాస్ దాడి ఆ చర్యను నిలిపివేసింది.
దీర్ఘకాలిక దృష్టిలేదు..
సైనిక విజయానికి మించి దీర్ఘకాలిక దృష్టి లేకపోవడమే నెతన్యాహూ అతిపెద్ద వైఫల్యం. ఇజ్రాయెల్ నిరంతర యుద్ద స్థితిలో ఉండజాలదు. ఏదో ఒక సమయంలో శాంతిని నెలకొల్పాల్సి ఉంటుంది. 1993 లో ఓస్లో శాంతి ఒప్పందాన్ని నెతన్యాహూ తీవ్రంగా వ్యతిరేకించారు. అక్టోబర్ 7 తరువాత పాలస్తీనియన్లతో శాంతియుతంగా జీవించలేమని ఎక్కువ మంది సాధారణ ఇజ్రాయెల్ పౌరులు భావిస్తున్నారు. నెతాన్యాహూ లాగే, ఇజ్రాయెల్ రాజకీయ ప్రతిపక్షం కూడా రెండు దేశాల పరిష్కారాన్ని వ్యతిరేకిస్తోంది.
అమెరికా, దాని మిత్రదేశాలు కూడా ఇజ్రాయెల్ మద్దతుదారులు, పాలస్తీనియన్లకు న్యాయం చేయకుండా ఇజ్రాయెల్ మనోభావాలను బుజ్జగించడం వల్ల విస్తృత గల్ఫ్ ప్రాంతంలో స్థిరత్వాన్ని సాధించలేమని నిర్ధారించుకోవాలి.
హమాస్ దాడి జరిగినప్పటి నుంచి గడచిన ఈ మూడు వినాశకరమైన సంవత్సరాలలో పాలస్తీనియన్లకు న్యాయమైన ఒప్పందం అందించడానికి ఇజ్రాయెల్ అంగీకరించేంత వరకూ ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోబడవు. హమాస్ దాడి వల్ల గాజా ప్రజలకు బాధ తప్ప మరేమీ కలగలేదు.
Next Story
