కాసేపట్లో రాజ్ భవన్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
x
సీఎల్పీ సమావేశం

కాసేపట్లో రాజ్ భవన్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధం అయింది. ఇప్పటికే సీఎం ఎంపికపై అధిష్టానికి ఏకవాక్య తీర్మానం పంపించారు


మరో రెండు గంటల్లో ఢిల్లీ నుంచి సీఎం ఎవరు అనేదానిపై స్పష్టత రానుంది. అయితే మెజారీటీ ఎమ్మెల్యేలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నే సీఎం గా ఉండాలని డీకే శివకుమార్ ను కోరినట్లు తెలిసింది. సీఎం అంశంపై క్లారిటీ రాగానే హోటల్ ఎల్లా నుంచి రాజ్ భవన్ కు ఎమ్మెల్యేలను తరలించడానికి అవసరమైన బస్సులను సిద్ధం చేశారు. రేవంత్ అయితే సీఎం అయితే మంత్రి వర్గంలో ఎవరూ ఉండాలి.. భట్టి విక్రమార్కకు ఏం పదవి ఇవ్వాలని, ఎవరికి ఏయే మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై ఏఐసీసీ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

సీఎం ఎవరూ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయానంతరం ముఖ్యమంత్రి ఎవరూ అనే అంశంపై హోటల్ ఎల్లాలో జరుగుతున్న కాంగ్రెస్ ఎల్పీ సమావేశం ముగిసింది.దాదాపు గంటసేపు ఈ సమావేశం జరిగింది. ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రి ఎంపిక నిర్ణయాన్ని అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మాణం చేశారు. మొదట తీర్మానాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా, తుమ్మల నాగేశ్వరావు బలపరిచారు. ఈ తీర్మానాన్ని ఢిల్లీకి పంపిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. గత కాంగ్రెస్ సంప్రదాయానికి భిన్నంగా ఈ సారి ఎన్నికలు జరిగిన వెంటనే కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీకి మెజారీటి కంటే కేవలం నాలుగు సీట్లే అదనంగా రావడంతో వెంటనే సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఆలస్యం అయిన కొద్ది పార్టీలోని అంతర్గత కలహాలు వచ్చే ప్రమాదం ఉందని, అది ప్రభుత్వ మనుగడకు ఇబ్బంది అవుతుందనే దృష్ట్యా వెంటనే సీఎం ను నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.

ప్రారంభమైన సీఎల్పీ సమావేశం

సీఎల్పీ సమావేశానికి పరిశీలకులుగా కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహ కొంతమంది ఏఐసీసీ నాయకులు హజరయ్యారు. సీఎల్పీ సమావేశానికి ముందే డీకే కాంగ్రెస్ సీనియర్ నాయకులైన భట్టి విక్రమార్క, మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పార్క్ హయాత్ హోటల్ లో సమావేశం అయి వారి అభిప్రాయం తెలుసుకున్నారు.

తెలంగాణ తొలి దళిత ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని భట్టి విక్రమార్క డీకే ముందు చెప్పినట్లు సమాచారం..మరోవైపు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం తనకు అవకాశం కల్పించాలని కోరినట్లు తెలిసింది. ఈ వరుసలో మరికొంతమంది సీనియర్ నేతలు సైతం సమావేశం అయి తమ పేరును పరిశీలించాలని విన్నవించారు.

అయితే ఎవరిని ముఖ్యమంత్రిని చేసిన అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని, వారి ఆదేశాలకు కట్టుబడి ఉంటామని చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉండగా రాజ్ భవన్ లో సీఎం ప్రమాణా స్వీకారానికి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రోజు రాత్రి వరకూ సీఎం తో పాటు, ముగ్గురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు ప్రచారం జరగుతోంది. అంతకు ముందు హోటల్ ఎల్లాలో ఎన్నికైన 64 మంది కాంగ్రెస్ ఎమ్మల్యేలు సమావేశం అయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం ప్రకారం సీఎం ఎంపికకు ఏకవాక్యం తీర్మానం చేసి అధిష్టానానికి పంపిస్తారు. కాగా నిన్న కాంగ్రెస్ పార్టీ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.

Read More
Next Story