2023 : రాజకీయాల్ని ఉత్తర, దక్షిణాలుగా చీల్చిన ఏడాది
x

2023 : రాజకీయాల్ని ఉత్తర, దక్షిణాలుగా చీల్చిన ఏడాది

2023‌లో జరిగిన ఎన్నికలు పార్టీలకు తీపి, చేదు జ్ఞాపకాలను మిగిల్చాయి. ఇంతకు ఏ పార్టీలు ఎన్ని రాష్ట్రాలను కైవసం చేసుకున్నాయి.. అవి అనుసరించిన వ్యూహం ఏమిటి?


ఈ ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు పార్టీలకు సెమీఫైనల్స్‌గా చెప్పుకోవాలి. వచ్చే ఏడాది కీలకమైన లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాలు ఎన్నికలలో హిందీభాష మాట్లాడే మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీ జోరుమీదుంది.

ఉత్తరాదిలోని మిజోరాం, ఛత్తీస్‌ఘడ్‌ ‌రాష్ట్రాలను కాంగ్రెస్‌ ‌కోల్పోగా.. దక్షిణాదిలోని కర్ణాటక, తెలంగాణలో ఆ పార్టీ గెలుచుకుంది. ప్రతి ఐదేళ్లకోసారి పాలనను మార్చే ధోరణి ఉన్న రాజస్థాన్‌ ‌తీర్పులో మార్పు వచ్చింది. ఈ సారి కూడా అక్కడ బీజేపీ గెలుపొందింది. ఛత్తీస్‌గఢ్‌ ‌కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చింది.

నిర్ణయాత్మక తీర్పు..

ఈ ఏడాది ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాల్లో పార్టీలు విజయం తమదేనంటూ బరిలోకి దిగాయి. అయితే ప్రజలు మాత్రం నిర్ణయాత్మక తీర్పునిచ్చారు. తీవ్ర ప్రజావ్యతిరేకత ఉందని నివేదికలు ఉన్నా ..మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది. 230గాను 164 స్థానాలను కైవసం చేసుకుంది.ఈ సారి కూడా గెలిచితీరాలన్న లక్ష్యంతో.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న అంశాన్ని పక్కన పెట్టి ప్రధాని మోదీని ఎన్నికల ప్రచారంలోకి దిగారు.

ఇదే వ్యూహాన్ని రాజస్థాన్‌లోనూ అమలు చేసింది కమలం పార్టీ. అక్కడ 200 స్థానాలకు 115 స్థానాలను గెలుపొందింది. ఇక ఛత్తీస్‌ఘడ్‌లో 90 స్థానాలకు 54 స్థానాలను కైవసం చేసుకుంది.

దక్షిణాది రాష్ట్రాలో కాంగ్రెస్‌ ‌పార్టీ బీజేపీని నిలువరించింది. కర్ణాటక, తెలంగాణలో హస్తం పార్టీ సత్తా చాటింది. కర్ణాటకలో బీజేపీని, అలాగే తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు నేతృత్వం వహిస్తున్న భారత్‌ ‌రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌)‌ని గద్దె దింపింది. కర్ణాటకలో 224 స్థానాలకుగాను 135, తెలంగాణలో 119 స్థానాలకుగాను 64 స్థానాలను కైవసం చేసుకుంది.

ఇక ఈశాన్య రాష్ట్రం త్రిపురలో బీజేపీ అధికారాన్ని దక్కించుకుంది. నేషనల్‌ ‌డెమోక్రటిక్‌ ‌పీపుల్స్ ‌పార్టీ (ఎన్‌డీపీపీ)తో కలిసి బీజేపీ పోటీ చేసింది. 60 స్థానాలకుగాను 32 స్థానాల్లో గెలుపొందింది.

దక్షిణాదిపై పట్టు కోల్పోయిన బీజేపీ ..

దక్షిణాదిలో బీజేపీ పాగావేయాలని చూసినా ఆ పార్టీకి సాధ్యంకాలేదు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ‌యువనేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ ‌జోడో యాత్ర’ సత్ఫలితాలనిచ్చింది. హస్తం పార్టీ గెలుపునకు మార్గం సుగమమైంది. 224 స్థానాలకుగాను 135 స్థానాలకు గెలుచుకుంది. కర్ణాటకలో బీజేపీకి బలమైన నాయకత్వం లేకపోవడం, లింగాయత్‌ ‌సామాజిక వర్గానికి చెందిన బీఎస్‌ ‌యడ్యూరప్పను దూరం పెట్టడమే ఓటమికి కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో 105 స్థానాలకుగాను 65 స్థానాలను గెలుచుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా నిలిచింది.

ఉచిత విద్యుత్‌, ‌బియ్యం పంపిణీ, నిరుద్యోగ భృతి పథకాలు ఓటర్లను ఆకర్షించాయని బీజేపీలోని ఓ వర్గం వారి అభిప్రాయం. 75 మంది కొత్త ముఖాలకు అందులో కొంతమంది అవినీతిపారులకు టికెట్లు ఇచ్చి బరిలో నిలపడం వల్లే కమలం పార్టీ ఓ•మిని చవిచూసిందని మరికొందరంటున్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌ ‌పార్టీ విజయం పొరుగు రాష్ట్రం తెలంగాణలో నూతనోత్తేజాన్ని నింపింది. పార్టీ శ్రేణులో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేతలంతా తెలంగాణలో పర్యటించారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సభల్లో పాల్గొని పార్టీ మ్యానిఫెస్టోను ప్రకటించారు. కాంగ్రెస్‌ ‌మ్యానిఫెస్టోకు ఆకర్షితులైన ఓటర్లు తెలంగాణలో పదేళ్లపాటు అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్‌ను ఓడించారు.

ఆ మూడు రాష్ట్రాల్లో సత్తాచాటని కాంగ్రెస్‌..

‌హిందీ భాష మాట్లాడే మూడు రాష్ట్రాల్లో (కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌) ‌కమలం, హస్తం పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే కర్ణాటకలో బీజేపీ ఓటమిపాలై కాంగ్రెస్‌ ‌గెలిచింది. మహారాష్ట్ర, గుజరాత్‌లో బీజేపీ పట్టునిలుపుకుంది.

మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ‌నేతృత్వంలోని కాంగ్రెస్‌పార్టీ మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాలకుగాను 65 స్థానాల్లో మాత్రమే గెలుపొంది బీజేపీ చేతిలో పరాభవాన్ని చవిచూసింది. ప్రజావ్యతిరేకత ఉన్నా అక్కడ బీజేపీ గెలవగలిగింది. బీజేపీ ముగ్గురు కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ జనరల్‌ ‌సెక్రటరీ కైలాష్‌ ‌విజయవర్జియాను బరిలో నిలిపింది. కాంగ్రెస్‌ ‌పార్టీ మ్యానిఫెస్టో, కమల్‌నాథ్‌ ‌ప్రయోగించిన హిందుత్వవాదం మధ్యప్రదేశ్‌లో పనిచేయలేదు.

రాజస్థాన్‌లో అశోక్‌ ‌గెహ్లాట్‌ ‌నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీపై బీజేపీ విజయం సాధించింది. ఆ పార్టీలో అంతర్గత విభేదాలు, నాయకత్వం లోపం కమలంపార్టీకి కలిసొచ్చింది. ఛత్తీస్‌ఘడ్‌లో ఎగ్జిట్‌ ‌పోల్స్ ‌కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. అంచనాలు తారుమారు చేస్తూ.. బీజేపీ మెజార్టీ స్ధానాలను కైవసం చేసుకుని సీఎం భూపేష్‌ ‌భాగల్‌ను గద్దె దింపింది.

ఇం‌డియా కూటమిలో చీలికలు తెరపైకి..

వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కూటమిలో చీలికలకు దారితీశాయి. కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ ‌మధ్య విభేదాలు తలెత్తాయి.

మధ్యప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవాలని భావించింది. అయితే తమ పార్టీ నేతలను ఒప్పించడంలో విఫలమైన హస్తంపార్టీ జోడికి జతకట్టలేదు. దీంతో అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌కాంగ్రెస్‌పై గుర్రుగా ఉన్నారు.

‘‘మధ్యప్రదేశ్‌లో సీట్ల ఇవ్వడం సాధ్యంకాకపోతే ముందే చెప్పి ఉండాల్సింది. మాకు బలం ఉన్న చోట స్వతంత్రంగా బరిలో నిలిచే వాళ్లం. ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నారు. ఇలా వ్యవహరిస్తే కాంగ్రెస్‌ను ఎవరు నమ్ముతారు? అయోమయంతో బీజేపీతో పోరాడి విజయం సాధించలేం’’ అని అఖిలేష్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఎన్ని సీట్లన్నది ముఖ్యం కాదు. ఏఏ సీట్లనేదే ముఖ్యం. మా వారు కోరుకున్న సీట్ల విషయంలో వాళ్లతో మాట్లాడాం. ఒప్పించడానికి అన్ని విధాలా ప్రయత్నించాం. కాని వారు అంగీకరించలేదు’’ అని కమల్‌నాథ్‌ ‌పేర్కొన్నారు.

మోదీ మ్యాజిక్‌ ‌మళ్లీ పనిచేస్తుందా?

మధ్యప్రదేశ్‌, ‌ఛతీస్‌ఘడ్‌, ‌రాజస్థాన్‌లో బీజేపీ విజయం సాధించింది. గెలిచిన మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రి బదులుగా ప్రధాని మోదీ, పార్టీ సీనియర్‌ ‌నేతలు ఎన్నికల ప్రచారం చేశారు.

నాయకత్వం బలంగా లేని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు ముందుగా చెప్పకపోవడమే బీజేపీ విధానమని కొందరు పేర్కొంటున్నారు. మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌, ‌ఛత్తీస్‌గఢ్‌లో సీనియర్లను పక్కన కొత్తవారిని ముఖ్యమంత్రి చేశారు.

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి కైలాష్‌ ‌విజయవర్గియాతో పాటు కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ ‌తోమర్‌, ‌ఫగ్గన్‌ ‌సింగ్‌ ‌కులస్తే, ప్రహ్లాద్‌ ‌పటేల్‌ను బిజెపి రంగంలోకి దించింది. వీరిలో ఒకరిని సీఎం చేయొచ్చని పార్టీ అంచనా వేసి ఉండవచ్చు. దానికి బదులుగా ప్రచారమంతా మోడీ చుట్టే తిరిగింది.

ప్రధాని మోదీ వల్లే మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధ్యమైందని పలువురు బీజేపీ నేతలు సోషల్‌ ‌మీడియా వేదికలపైకి వచ్చారు. రాజస్థాన్‌ ‌మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మాట్లాడుతూ.. ప్రధాని హామీలపై ప్రజలు ఉంచిన విశ్వాసం వల్లే రాష్ట్రంలో విజయం సాధించామన్నారు. ‘‘ఈరోజు ఛత్తీస్‌గఢ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌రాజస్థాన్‌ ఎన్నికల ఫలితాలు బీజేపీపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనం’’ అని విదేశాంగ మంత్రి ఎస్‌ ‌జైశంకర్‌ ఎక్స్(‌ట్విట్టర్‌) ‌లో పోస్ట్ ‌చేశారు.

Read More
Next Story