పోస్టల్ బ్యాలెట్ లో హోరాహోరీ పోరు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ కాస్త ముందజలో ఉంది. కొడంగల్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధిక్యంలో ఉండగా, నల్గొండ జిల్లాలో కోమటి రెడ్డి బ్రదర్స్ , ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది స్థానాల్లో కాంగ్రెస్ ముందజలో ఉంది. మధిరలో భట్టి విక్రమార్క, పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు లీడ్ లో ఉన్నారు. అలాగే బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ అర్భన్, రూరల్ లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కాగా కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు స్థానాల్లో ఒకటైన కామారెడ్డిలో బీజేపీ పోస్టల్ బ్యాలెట్ లో ఆధిక్యం సాధించింది. గజ్వేల్ మాత్రం సీఎం కేసీఆర్ ఆధిక్యం సాధించారు. సిరిసిల్లా లో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు, బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ ఆధిక్యంలో ఉండగా, కరీంనగర్ లో బీజేపీ మెజారీటీ పోస్టల్ ఓట్లు సాధించింది. పాత బస్తీలో ఎంఐఎం మరోసారీ తన పట్టునిలుపుకుంది. కాగా మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ గఢ్ లో బీజేపీ ముందజలో ఉంది.