మన సీఎం కేసీఆరే ?
x
KADIYAM SRIHARI (FILE)

మన సీఎం కేసీఆరే ?

అదెలా అనుకుంటున్నారా? బీఆర్‌ఎస్‌ సీనియర్‌ ‌లీడర్‌ అన్న మాటలు నిజమవుతాయా? లెట్స్ ‌వాచ్‌.. ‌వాట్‌ ‌హ్యాపెన్స్ ..


‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ‌నుంచి పోటీచేసి గెలిచిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన విజయోత్సవ ర్యాలీలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.

ఇంతకు ఏం మాట్లాడారు..

‘‘పార్టీ అధికారంలోకి రాలేదని ఎవరు భయపడవలసిన అవసరం లేదు. మళ్లీ.. ఆర్నెళ్లా..రెండు సంవత్సరాలా..మూడు సంవత్సరాలా చెప్పలేం కాని..మళ్లీ ప్రభుత్వం మనదే..మన ముఖ్యమంత్రి కేసీఆరే..కాంగ్రెస్‌ ‌పార్టీకి మెజార్టీ వచ్చింది. దాన్ని కాపాడుకుంటారో..లేదో చూడాలి. ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును మనం గౌరవించాలి. పటిష్ఠమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం.’’ అని అన్నారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ పాలనాపగ్గాలు చేపట్టకముందే కడియం చేసిన కామెంట్లు హాట్‌ ‌టాపిక్‌గా మారాయి. తెలంగాణలో మొత్తం స్థానాలు 119. హస్తం గుర్తు పార్టీకి మేజిక్‌ ‌ఫిగర్‌ (60) ‌కన్నా నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువొచ్చాయి. దాన్ని ఎంతకాలం కాపాడుకుంటారో చూద్దాం అన్నది ఆయన మాటల సారాంశం.

Read More
Next Story