పెద్దాయన ఆశీస్సులు కూడా ఉండాలని..
x

పెద్దాయన ఆశీస్సులు కూడా ఉండాలని..

భట్టికి ఆయనంటే ఎంతో అభిమానం. తన పూజ గదిలో ఉండే ఆ ఫొటోను చూస్తే తెలుస్తుంది.. ఆ వ్యక్తిని భట్టి ఎంత గౌరవిస్తారోనని..ఆయనెవరో మీరూ తెలుసుకోవాలనుకుంటున్నారా?..


7.12.2023. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్‌ ‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే రోజు. అంతకు ముందు రోజే భట్టి విక్రమార్కకు ఫోన్‌ ‌వచ్చింది. మిమ్మల్ని డిప్యూటీ సీఎం చేస్తున్నాం..ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం అందింది.

మర్నాడు ఆ కార్యక్రమానికి రెడీ అవుతున్నారు. స్నానం చేసి పూజ గదిలోకి వెళ్లి దేవుళ్ల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ పక్కనే ఉన్న వైఎస్‌ ‌చిత్రపటానికి కూడా నమస్కరించి ఎల్బీ స్టేడియంకు బయల్దేరారు.

వైఎస్‌ అం‌టే ఎందుకంత అభిమానం..



ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ ‌పార్టీని వరుసగా రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత డాక్టర్‌ ‌వైఎస్‌ ‌రాజశేఖర రెడ్డిది. భట్టి విక్రమార్క ఆయనతో కలిసి పనిచేశారు. వైఎస్‌ ‌ప్రధాన అనుచరుడిగానే కాకుండా విశ్వాసపాత్రుడిగా భట్టికి పేరుంది. తాను వైఎస్సార్‌ అభిమానినంటూ చాలా సందర్భాల్లోనూ చెప్పుకున్నారు కూడా.

వైఎస్‌ ‌హయంలో చీఫ్‌ ‌విప్‌..

‌వైఎస్‌ ‌హయంలో (2004-2009) వరకు ప్రభుత్వ చీప్‌ ‌విఫ్‌గా పనిచేశారు. 2011 నుంచి 2014వరకు డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగారు. ప్రస్తుతం తెలంగాణలోని మధిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ‌తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికలకు ముందు ఆయన 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో అపోజిషన్‌ ‌లీడర్‌గా ఉన్నారు.

ఇడుపులపాయకు వెళ్తారా..

తన పూజ గదిలో వైఎస్సార్‌ ‌చిత్రపటం ఉంచడం భట్టి గురుభక్తికి అద్దం పడుతోంది. వైఎస్‌ఆర్‌ ‌కుటుంబంతో ఎంతో అనుబంధమున్న బట్టి ..త్వరలో కడప జిల్లాలోని ఇడుపులపాయకు వెళ్తారని వార్తలొస్తున్నాయి. అక్కడ వైఎస్‌ ‌సమాధిని సందర్శించి, నివాళి అర్పిస్తారని అనుచరుల నుంచి వస్తున్న మాట.





Read More
Next Story