మోదీ హ్యాట్రిక్ కోసం  కులాల మీద కన్నేస్తున్న బిజెపి
x
బిజెపి కులాలకు ప్రాముఖ్యం ఇవ్వడం కొత్త ట్రెండ్...

మోదీ హ్యాట్రిక్ కోసం కులాల మీద కన్నేస్తున్న బిజెపి

ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లో కుల సమీకరణకు శ్రీకారం చుట్టింది కమలం పార్టీ. వచ్చే లోకసభ ఎన్నికల్లో కులాల నుంచి లబ్ది పొందాలనుకోవడమే దీనికి కారణమా?


2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) మధ్యప్రదేశ్‌(Madhya pradesh) ముఖ్యమంత్రులుగా ఇద్దరు కొత్త ముఖాలను ఎంపిక చేసింది. అయితే వారి పేర్లను నిర్ణయించడానికి పార్టీకి వారం కంటే ఎక్కువ సమయం పట్టింది.

సోమవారం (డిసెంబర్‌ 11) భోపాల్‌లో జరిగిన బీజేపీ(BJP) శాసనసభా పక్ష సమావేశం తర్వాత మధ్యప్రదేశ్‌ సీఎంగా యాదవ్‌ (MohanYadav) పేరును ప్రకటించారు. ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ్‌తో పాటు, జగదీష్‌ దేవదా, రాజేంద్ర శుక్లాలను డిప్యూటీ సీఎంలుగా, మాజీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ను స్పీకర్‌గా ఉండాలని నిర్ణయించారు.

తరతరాల మార్పు..

కొత్త ముఖ్యమంత్రిగా యాదవ్‌ ఎంపిక మధ్యప్రదేశ్‌లో తరతరాల మార్పునకు నాంది పలికింది. కొత్త నాయకులకు రాష్ట్రాన్ని, శాసనసభా పక్షాన్ని నడిపించే అవకాశం ఇచ్చినట్లయ్యింది. ఈ నియామకంతో నవంబర్‌ 2005లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నాలుగు పర్యాయాల పదవీకాలం ముగిసింది.

ఆదివారం (డిసెంబర్‌ 10) ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్‌ సాయి (Vishnu deo sai)ని నియమించారు. మధ్యప్రదేశ్‌ మాదిరిగానే ఇక్కడ కూడా మార్పులు చేయడానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఉపయోగపడ్డాయి.

‘‘మధ్యప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపించడంలో మోహన్‌ యాదవ్‌ కీలక పాత్ర పోషిస్తారు’’ అని శాసనసభా పక్ష సమావేశానికి పరిశీలకుడిగా నియమితులైన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో యాదవ్‌ పేరును శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, ఇటీవల కేంద్ర మంత్రిమండలికి రాజీనామా చేసిన ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ మద్దతు పలికారు.

కుల సమతుల్యాన్ని కాపాడుకోవడం..

2024 సార్వత్రిక ఎన్నికలకు ఐదు నెలల కంటే తక్కువ సమయం ఉన్నందున.. మధ్యప్రదేశ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ముఖ్యమంత్రిగా ఓబీసీ నాయకుడిని నియమించడంతో రాష్ట్రంలో ఆధిపత్య వర్గంపై కమలం పార్టీ పట్టు సాధించింది.

షెడ్యూల్డ్‌ కులాల (ఎస్‌సి) వర్గానికి చెందిన దేవదా, బ్రాహ్మణుడైన రాజేంద్ర శుక్లా ఎంపిక లోక్‌సభ ఎన్నికలకు కలిసి వస్తుందని కమలం పార్టీ సీనియర్‌ నాయకులు భావిస్తున్నారు.

తోమర్‌ను స్పీకర్‌గా నియమించడంతో రాజ్‌పుత్‌ సామాజిక వర్గం మద్దతు బీజేపీకి లాభిస్తుంది.

2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మధ్యప్రదేశ్‌లోని 29 లోక్‌సభ స్థానాల్లో ఆధిపత్యాన్ని సాధించేందుకు బీజేపీ సమాయత్తమవుతోంది. 2019 ఫలితాలు, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలను రిపీట్‌ చేసేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తుంది.

‘నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు. ప్రధాని మోదీ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తాను’ అని సమావేశం అనంతరం యాదవ్‌ అన్నారు.

గిరిజనులపై దృష్టి..

రాష్ట్ర నాయకత్వాన్ని మార్చి బీజేపీకి అనుకూలంగా ఓటర్లను సంఘటితం చేసే వ్యూహం.. మధ్యప్రదేశ్‌లోనే కాకుండా ఛత్తీస్‌గఢ్‌లో కూడా ప్రారంభమైంది. ఇక్కడ మొదటిసారిగా గిరిజనుడిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది ఆ పార్టీ. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రమణ్‌ సింగ్‌ 15 ఏళ్ల పదవీకాలం తర్వాత బీజేపీ కొత్త ముఖ్యమంత్రిగా వినోద్‌ దేవ్‌ సాయిని నియమించింది.

జార్ఖండ్‌లో కూడా బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా గిరిజన నాయకుడు బాబులాల్‌ మరాండీని నియమించిన విషయం తెలిసిందే.

ఛత్తీస్‌గఢ్‌లో తన రాజకీయ, సామాజిక పునాదిని మరింత పటిష్టం చేసుకునేందుకు బీజేపీ ఇక్కడ కూడా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని నిర్ణయించింది. అయితే వీరి పేర్లు ఇంకా ఖరారు కాలేదు. డిప్యూటీల్లో ఒకరు ఓబీసీ వర్గానికి చెందిన వారు కాగా, రెండో వ్యక్తి అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అవుతారని బీజేపీ సీనియర్‌ నేతలు భావిస్తున్నారు.

ప్రతిపక్ష వ్యూహాన్ని ఎదుర్కోవడం...

జాతీయ స్థాయిలో కుల గణన గురించి మాట్లాడే ప్రతిపక్ష పార్టీల వ్యూహాన్ని ఎదుర్కోవడానికి మధ్యప్రదేశ్‌లో ఓబీసీ నేతను ముఖ్యమంత్రిగా నియమించాలని బీజేపీ నిర్ణయించుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘‘మనం మధ్యప్రదేశ్‌ను పరిశీలిస్తే, సీఎం ఓబీసీ వర్గానికి చెందినవారు, డిప్యూటీ సీఎంలు ఎస్సీ, బ్రాహ్మణులు. స్పీకర్‌గా నరేంద్ర సింగ్‌ తోమర్‌ నియామకం బీజేపీకి మేలు చేస్తుంది. ఈ నియామకాల ద్వారా నాలుగు బలమైన కుల సంఘాలపై దృష్టి సారించేందుకు అధికార పార్టీ ప్రయత్నించింది. కుల గణనపై ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి కూడా ఈ మార్పులు బీజేపీకి దోహదపడతాయి. ఇవన్నీ 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావడానికే..’’ అని ఉజ్జయినిలోని మధ్యప్రదేశ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్స్‌ రీసెర్చ్‌ ప్రొఫెసర్‌, డైరెక్టర్‌ యతీంద్ర సింగ్‌ సిసోడియా అన్నారు.

లోక్‌సభ ఎన్నికల సమయంలో.. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌(Congress) అధిపత్యాన్ని నిరోధించడానికి ఛత్తీస్‌గఢ్‌లో కూడా బీజేపీ ఇదే విధమైన క్యాస్ట్‌ బేసిడ్‌ పాలిటిక్స్‌ ప్రయత్నిస్తోందని సిసోడియా అన్నారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోటీ చేయాలని బిజెపి నాయకత్వానికి తెలుసునని సిసోడియా అన్నారు. కాబట్టి సార్వత్రిక ఎన్నికలకు ముందు వీలైనన్ని ఎక్కువ కులాల మద్దతు పొందాలని ప్రయత్నిస్తోంది.

కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు అవకాశం

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఇటీవల నియామకాలు నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ఇటీవల కేంద్ర మంత్రి మండలి నుంచి రాజీనామా చేసిన తర్వాత కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ గురించి బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది.

మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకోవడం లేదా పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పించవచ్చని బీజేపీ సీనియర్‌ నాయకులు భావిస్తున్నారు.

అదేవిధంగా, రాజస్థాన్‌ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే అత్యున్నత పదవిని వదులుకోడానికి ఆమె కుమారుడు దుష్యంత్‌ సింగ్‌కు పార్టీలో సముచిత స్థానం కల్పించే యోచనలో బీజేపీ నాయకులు ఉన్నట్లు సమాచారం.

Read More
Next Story