బీజేపీ, బీఆర్‌ఎస్‌.. అలయ్‌..‌బలయ్‌
x

బీజేపీ, బీఆర్‌ఎస్‌.. అలయ్‌..‌బలయ్‌

నిన్నటి వరకు ఉప్పూ నిప్పుగా ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఇవాళ అలాయ్‌ ‌బలాయ్‌ అనుకున్నారు. ఆలింగనాలు చేసుకున్నారు. తలలు నిమురుకున్నారు.


నిన్నటి వరకు ఉప్పూ నిప్పుగా ఉన్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఇవాళ అలాయ్‌ ‌బలాయ్‌ అనుకున్నారు. ఆలింగనాలు చేసుకున్నారు. తలలు నిమురుకున్నారు. పార్టీలు, గుర్తులు, విమర్శలు ఎన్నికల వరకు ఆజన్మాంతం కాదని నిరూపించారు. ఇందుకు హైదరాబాద్‌ ‌గన్‌పార్క్ ‌వేదికైంది. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించేందుకు ముందుగా బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చారు. కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వెళుతున్న దశలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వచ్చారు. ఎదురెదురు పడిన ఇరు పార్టీల ఎమ్మెల్యేలు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆలింగనాలు చేసుకున్నారు. కుశల ప్రశ్నలు వేసుకుంటూ అసెంబ్లీలో కలుద్దాం అనుకుంటూ వెళ్లిపోయారు.





Read More
Next Story