బీఆర్ఎస్ ప్రభుత్వం వేలకోట్లు మళ్లిస్తోంది: కాంగ్రెస్
x
మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు

బీఆర్ఎస్ ప్రభుత్వం వేలకోట్లు మళ్లిస్తోంది: కాంగ్రెస్

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మంత్రివర్గ సమావేశం పెట్టడం పై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది


హైదరాబాద్ చుట్టుపక్కలా ఉన్న అసైన్ మెంట్ ల్యాండ్ టైటిల్ రికార్డులను బీఆర్ఎస్ నాయకులు ధరణిలో మారుస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ దృష్టికి తీసుకువచ్చినట్లు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకి వివరించారు. అలాగే రైతు బంధు కి సంబంధించిన ఆరు వేల కోట్ల రూపాయలను తమకు నచ్చిన కాంట్రాక్టర్లుకు చెల్లించి వాటి ద్వారా అవినీతికి పాల్పడుతున్నారనే సమాచారం తమకుందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఎలా మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారని ప్రశ్నించారు. నిబంధనలు పాటించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని కోరినట్లు తెలిపారు. ఈసీని కలిసిన వారిలో టీ పీసీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్, పొంగులేటీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. శుక్రవారం ఎన్నికలు ముగిసిన వెంటనే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ పోల్ స్టర్లు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోికి వస్తుందని అంచనావేశాయి. తెలంగాణ ఏర్పాటు అయినా పది సంవత్సరాల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానుందని తేలడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర సందడి వాతావరణం నెలకొంది. పోలీసులు ఇప్పటికే ఆయన ఇంటికి రక్షణ చర్యలు చేపట్టారు.

Read More
Next Story