తెలంగాణ ఎన్నికల్లో ఓడిన ప్రముఖులు వీరే..
x
ERRABELLI DAYAKAR RAO

తెలంగాణ ఎన్నికల్లో ఓడిన ప్రముఖులు వీరే..

కొంతమందికారు దిగారు, కొందరు చేయి కాల్చుకున్నారు. మరకొన్ని చోట్ల కమలం వాడిపోయింది...


ఓడిన వారిలో పాలకుర్తి నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఆలేరులో గొంగిడి సునీత, వరంగల్ ఈస్ట్ నుంచి దాస్యం వినయ్ భాస్కర్, జోగు రామన్న, బాల్క సుమన్ ఉన్నారు. వీరిలో అలాగే బీజేపీ నుంచి దుబ్బాకలో పోటీ చేసిన రఘునందన్ రావు, హూజురాబాద్ లో ఈటల రాజేందర్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, కోరుట్ల నుంచి డి. అర్వింద్ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి గద్దర్ కుమార్తె వెన్నెల, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఓటమి పాలయ్యారు. అన్నింటి కంటే ముఖ్యంగా కామారెడ్డిలో సీఎం కేసీఆర్ మూడో స్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకూ బీజేపీ- కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. రౌండ్ రౌండ్ కు ఆధిక్యం మారుతూ వస్తోంది.

బీఆర్ఎస్ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రంగా వ్యతిరేకత ఉందని తెలిసినప్పటికీ వారికి టికెట్లు ఇవ్వడం ఒక కారణంగా చెబుతున్నారు. అలాగే దళిత బంధు లాంటి పథకాల్లో ఎమ్మెల్యేలు చేతివాటం ప్రదర్శిస్తున్నారని సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటికీ సరైన చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యారని ఒక కారణంగా చెప్పవచ్చు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగడం, గ్రూప్1 సహ ఇతర పరీక్ష పేపర్లు లీక్ కావడంతో బీఆర్ఎస్ పై ప్రభుత్వ వ్యతిరేకత పెరగడానికి కారణంగా చెబుతున్నారు.

Read More
Next Story