చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఉదయం సిద్దిపేట జిల్లా చింతమడకలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ 11 గంటల వరకూ 20.67 శాతం నమోదు అయింది. పట్టణాల కంటే పల్లెల్లో పోలింగ్ ఊపందుకుంది. ఓటర్లు భారీగా క్యూలైన్ల లో నిలుచుని మరీ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజధాని అయిన హైదరాబాద్ లో మాత్రం ఓటర్లు ఉత్సాహం చూపించట్లేదు. కేవలం 12 శాతం మాత్రమే పోలింగ్ నమోదు అయింది. కాగా హైదరాబాద్ లోని సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణితో కలిసి షేక్ పేటలో ఓటు వేశారు. జూబ్లీ హిల్స్ లో నటుడు అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓబుల్ రెడ్డి స్కూల్ లో జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Next Story