రేవంత్ ప్రమాణ స్వీకారానికి తరలివస్తున్న ఎర్రచొక్కాలు
x

రేవంత్ ప్రమాణ స్వీకారానికి తరలివస్తున్న ఎర్రచొక్కాలు

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులు తరలివస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా వస్తున్నట్టు సమాచారం వచ్చింది.


తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి అతిరథ మహారథులు తరలివస్తున్నారు. సోనియా గాంధీ మొదలు వామపక్ష నేతల వరకు ఎందరెందరో వస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా వస్తున్నట్టు సమాచారం వచ్చింది. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం నుంచి సీపీఐ అభ్యర్థిగా ఎంపికైన కూనంనేని సాంబశివరావు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.

సీపీఐ బృందంలో ఎవరెవరున్నారంటే...

రేవంత్ రెడ్డి రేపు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కే నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, చాడా వెంకటరెడ్డి తదితరులు హాజరవుతున్నారు. ఈ విషయాన్ని కూనంనేని సాంబశివరావు ధృవీకరించారు.

Read More
Next Story