తెలంగాణలో కాంగ్రెస్ కే మొగ్గు
x
ఓటు వేసిన అనంతరం సిరా చూపుతున్న మహిళలు

తెలంగాణలో కాంగ్రెస్ కే మొగ్గు

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు ఉన్నా కాంగ్రెస్ వైపే మొగ్గు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేశాయి. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ప్రస్తుతం చత్తీస్ గఢ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరోసారి తన పట్టును నిలుపుకోనున్నట్లు సర్వే సంస్థలు అంచనాలు వెలువరించాయి. అలాగే రాజస్తాన్, మధ్య ప్రదేశ్ లో మరోసారీ బీజేపీకీ అవకాశం ఉన్నట్లు తెలిపాయి. రాజస్తాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అధికారం మార్చే సంప్రదాయం ఉన్న ఈ ఎడారి రాష్ట్ర ప్రజలు, మరోసారి ఇదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. ఈశాన్య రాష్ట్రం మిజోరాం లో జోరామ్ పీపుల్స్ మూవ్ మెంట్(జెడ్పీఎం), మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) మధ్య పోరు నెలకొని ఉందని, జాతీయ పార్టీలు ఎన్నికల పోరులో చాలా వెనకబడి ఉన్నాయని పోల్ స్టర్లు అంచనావేశారు. కాగా ఐదు రాష్ట్రాలకు నవంబర్ 7 నుంచి 30 మధ్య ఎన్నికలు జరిగగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు ఈసారి కాంగ్రెస్ దెబ్బ కొట్టనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువరించాయి. స్వల్ప అధిక్యంతో తెలంగాణలో కాంగ్రెస్ ఫ్రభుత్వ ఏర్పాటు ఖాయమని మెజారిటీ పోల్ స్టర్లు అంచనా వేశాయి. తెలంగాణ అసెంబ్లీ లో 90 స్థానాలు ఉన్నాయి. 60 స్థానాలు గెలుచుకున్న పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి.

తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు

ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ అంచనా ప్రకారం కాంగ్రెస్ 63-79, బీఆర్ఎస్ 31-47, బీజేపీ 2-4, ఎంఐఎం 5-7 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

రిపబ్లిక్ టీవీ- మ్యాట్రీజ్ అంచనా ప్రకారం కాంగ్రెస్ 58-68, బీఆర్ఎస్ 46-56, బీజేపీ5-9 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ 49-59, బీఆర్ఎస్ 48-58 సీట్లు వస్తాయని టీవీ9 భరత వర్ష పేర్కొంది.

జన్కీబాత్ అంచనా ప్రకారం కాంగ్రెస్ కు 48-64, బీఆర్ఎస్ కు 40-55, బీజేపీకి 7-13 ఎంఐఎంకు 4-7 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ కు 62-72, బీఆర్ఎస్ కు 35-46,బీజేపీకి 3-8, ఎంఐఎంకు 6-7, ఇతరులు 1-2 స్థానాలు గెలుస్తారని పీపుల్స్ పల్స్ తెలిపింది.

టుడేస్ చాణక్య ప్రకారం కాంగ్రెస్ కు 71+,-9, బీఆర్ఎస్ కు 33+,-9, బీజేపీ 7+,-5, ఇతరులు 8+,-3 సీట్లు వస్తాయని అంచనా వేసింది.



Read More
Next Story