అయ్యవారికిచ్చా ఐదు కోట్లు.. కేసీఆర్కి అప్పిచ్చిన వివేక్

'ఒకవైపు ముఖ్యమంత్రి రాష్ట్రంలోని మూడున్నర కోట్ల మంది ప్రజలకు పెద్దదిక్కుగా ఉన్నాయన... ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నారు.'


అయ్యవారికిచ్చా ఐదు కోట్లు.. కేసీఆర్కి అప్పిచ్చిన వివేక్
x
Ex MP Vivek Venkata Swamy

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి రాష్ట్రంలోని మూడున్నర కోట్ల మంది ప్రజలకు పెద్దదిక్కుగా ఉన్నాయన... ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నారు... అదీ సంగతి. ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

నిన్న మొన్నటి వరకూ ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్న వీరిద్దరి మద్య లోపాయికారి ఒప్పందం కూడా ఉందని బట్టబయలైంది. అదీ కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల పుణ్యమే. అదేలా అంటారా... కేంద్ర ఎన్నికల సంఘం విధించిన నియమ నిబంధనలు తుచ తప్పకుండా పాటించాలి. అలా లేదంటే.. ఆ అభ్యర్థి ఎవరైనా సరే.. ఏపార్టీకి చెందిన వారైనా సరే... ఎంత ఆస్థిపాస్తుల ఉన్నా సరే... నామినేషన్ తిరస్కరణ... ఇప్పుడే కాదు.... ఎన్నికల్లో పోటీ చేసిన విజయం సాధించి పదవిలో ఉన్న ఐదేళ్లలో ఎప్పుడు ’ఆ అఫిడవిట్’లో తేడాలు ఉన్నా ఆయన ఇక ఇంటికే... అలాగని ఉత్తినే వదిలేయరు... కేసులు పెట్టి బొక్కలో తోసి తాట తీస్తారు.

అసలు విషయానికి ఇప్పుడు వచ్చేద్దాం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ రోజు నామినేషన్ల పరిశీలన జరిగింది. అభ్యర్థులు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి అందించిన ఆస్తులు... అప్పుల చిట్టా గుట్టురట్టు అయ్యింది. ఆ చిట్టాలోనే తెలంగాణ రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్... కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, ప్రస్తుత చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.వివేక్ వెంక‌ట‌స్వామి నుండి కోటి రూపాయలు అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని దళితులందరికీ ’దళితబంధు’ పథకం, రైతుల‌కు రైతు బందు ఇస్తున్న సీఎం కేసీఆర్ ఒక దళిత నాయకుడు వివేక్ వద్ద కోటి రూపాయలు తీసుకోవడమే ఇప్పుడు ప్ర‌త్యేక‌ చర్చకు దారి తీసింది. ఇప్పటికే వివేక్ ఆస్తుల విలువ 606.2 కోట్ల రూపాయలని అధికారికంగా ప్రకటించారు.

ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థుల్లో ఈయనే ’ఖరీదైన’ అభ్యర్థి. తనకు ఉన్న చరాస్తులు, స్థిరాస్తులు, అప్పుల వివరాలను కూడా అఫిడవిట్లో వివేక్ వెల్లడించారు. రాష్ట్రంలో అప్పు ఇచ్చిన వ్యక్తి మొదటి స్థానంలో ఉంటే... రెండో స్థానంలో ఉన్న సీఎం కేసీఆర్ అప్పు తీసుకోవ‌డం గమనార్హం. అలాగే అఫిడవిట్లో ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి మునుగోడు నుంచి పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా వివేక్ 1.50 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ 450 కోట్లకు పైగా ఆస్తులతో రెండవ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రమంతా ఇదే చర్చనీయాంశమైంది. ఇప్పుడు చెప్పుకుందాం... రాజకీయాలు రాజకీయాలే... ఒకరికొకరు సహకరించుకోవడం సహజమే. మరి పార్టీల జెండాలు మోస్తున్న కార్యకర్తలు ఎందుకు పార్టీల పేరుతో రాద్దాంతం చేస్తుంటారు..? ఎందుకంటే ’జెండాను’నమ్ముకున్న వారికి నాయకుల రహస్య అజెండా ఏంటో తెలియదు కదా..! అందుకే నేతలు అలా... కార్యకర్తలు ఇలా.. భలా ఏమిరా ఈ రాజకీయం... !!

Next Story