KCR RESIGNATION

సీఎం పదవికి రాజీనామా చేసిన కేసీఆర్


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. తన ఓఎస్డీ ద్వారా రాజీనామా లేఖను గవర్నర్ తమిళి సై కి పంపించినట్లు సమాచారం. అనంతరం ఎటువంటి సెక్యూరిటీ లేకుండా కేవలం 2+2 గన్ మెన్లతో రెండు ప్రయివేట్ వాహనాల్లో ట్రాఫిక్ లోనే కేసీఆర్ ఎర్రవెల్లిలోని నివాసానికి వెళ్లారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం 39 సీట్లను మాత్రమే గెలుచుకుంది.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను సాధించింది. ఇప్పటి వరకూ 65 స్థానాల్లో హస్తం పార్టీ విజయం సాధించింది. ఈ నెల 9న సోనియా గాంధీ జన్మదినం ఉండడంతో అదే రోజు ఎల్భీ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని తొలుత గాంధీ భవన్ వర్గాలు ప్రకటించిన, తరువాత ఈ రోజే సీ ఎల్పీ సమావేశం నిర్వహించి అనంతరం రేపే ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరగుతోంది. మీడీయా సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి డీజీపీ అంజన్ కుమార్ తో భేటీ అయ్యారు. ఇందులో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన భద్రతా చర్యల గురించి ఆదేశించినట్లు తెలుస్తోంది.

Read More
Next Story