‌నెక్ట్ ‌లిస్టులో నా పేరుంటుంది ..
x

‌నెక్ట్ ‌లిస్టులో నా పేరుంటుంది ..

ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయా? అన్న ప్రశ్నకు కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి ఏం సమాధానం ఇచ్చారంటే..


మంత్రి వర్గ రెండో జాబితాలో నాపేరు ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి. మునుగోడు నుంచి కాంగ్రెస్‌ ‌తరుపున ఆయన పోటీ చేసి గెలుపొందారు.మంత్రివర్గ తొలిజాబితాలో ఆయన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్థానం దక్కిన విషయం తెలిసిందే. ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయా? అన్న ప్రశ్నకు ‘‘అది వాళ్ల కెపాసిటీని బట్టి ఉంటుంది. చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నా.. నల్లగొండలో పార్టీ బలోపేతానికి కృషిచేశా.’’ అని సమాధానమిచ్చారు. ఉప ముఖ్యమంత్రి కాబోతున్న భట్టి విక్రమార్కను ఆయన ఇంట్లో కలిసిన సందర్భంగా రాజగోపాల్‌ ‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

Read More
Next Story