జిగేల్.. జిగేల్..
ఆ ప్రాంతమంతా విద్యుత్ దీపాలు కాంతులే.. కాంతులు.. దారి పొడవునా హై ఫోకస్ లైట్లు..మరి రేవంతా.. మజాకా..
సీఎం పేరు ఇంకా ఖరారు కాలేదు. కాని తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులకు మాత్రం ఆయనే ముఖ్యమంత్రి అని సంకేతాలందినట్టున్నాయి. అందుకే స్తంభాలెక్కేస్తున్నారు. తీగలు సరిచేస్తున్నారు.ట్రాన్స్‌ఫార్మర్లను మార్చేస్తున్నారు.
జూబ్లీహిల్స్‌లో రేవంత్ ఇల్లు ఉంది. ఆయన ఇంటికి వెళ్లే దార్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తున్నారు ఎలక్ట్రిసిటీ అధికారులు. విద్యుత్ లైన్లను సరిచేస్తున్నారు. కొత్త లైట్లను అమరుస్తున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరు పరిశీలిస్తున్నారు...ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ ఇంటికెళ్లే దారంతా ఇక జిగేల్.. జిగేలే..
Next Story