సచివాలయం ఎపుడూ ఓపెనే: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
x
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

సచివాలయం ఎపుడూ ఓపెనే: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఇక నుంచి ప్రజలకు సుపరిపాలన అందిస్తామని, సామాన్యుల కోసం సచివాలయం గేట్లు తెరుచుకుంటాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.


ఇక నుంచి ప్రగతి భవన్ పేరు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రజా భవన్ గా మారుస్తున్నామని పిసిసి అధ్యక్షుడు ఎ రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో మానవ హక్కులు, ప్రజాస్వామిక ఆకాంక్షలకు చోటునిస్తామని అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం అనంతరం ఆయన గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.

డిసెంబర్ 3,2009 లో తెలంగాణ అమరుడు శ్రీకాంతా చారీ ఆత్మార్ఫణం చేసుకున్నది ఇదే రోజని, కాంగ్రెస్ విజయాన్ని అమరవీరులకు అంకితం చేస్తున్నామని చెప్పారు.

సోనియాగాంధీ, రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ధన్యావాదాలు తెలిపారు. రాహూల్ గాంధీ తెలంగాణలో 21 రోజుల పాటు భారత్ జోడో యాత్ర చేయడం మాకు ఎంతో స్పూర్తినిచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రమాణస్వీకారానికి ప్రతిపక్షాలను ఆహ్వనిస్తున్నామని ప్రకటించారు. శాసనసభలో ప్రతిపక్షం గొంతు వినిపించే అవకాశం ఇస్తామని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇక ప్రతిపక్షంలో కూర్చుంటారని, అయినా తాము ఆయనతోసంప్రదింపులు కొనసాగిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పాలసీ ప్రకటిస్తుందని, దానిఅమలుకు అందరి సహకారం తీసుకుంటామని, చివరకు ఎఐఎంఐఎం సహాకారం తీసుకుంటామని రేవంత్ ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించిన పెద్దలయిన కె జానారెడ్డి, సిఎల్ పి నేత భట్టి విక్రమార్క,ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామెదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులకు ధన్యావాదాలు తెలిపారు.

సమావేశంలో రేవంత్ సిఎం, రేవంత్ సిఎం అని నినాదాలిస్తున్న కార్యకర్తలను ఆయన ‘అది పద్థతి’ కాదని మందలించారు.

అలాగే తన ప్రతి విషయంలో భుజం తట్టి, అండగా నిలిచిన మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కి సైతం ధన్యవాదాలు తెలిపారు. తాము హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్ ఓటమి ఒప్పుకున్నట్లు చేసిన ట్వీట్ చాలా హుందాగా ఉందని చెప్పారు. 2004 నుంచి 2014 వరకూ దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎలా పాలించారో అలా పాలిస్తామని వివరించారు. తమ గెలుపు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.

Read More
Next Story