ప్రజాదర్బార్‌కి క్యూ కట్టిన జనం
ప్రగతీ భవన్ ప్రజాభవన్‌గా మారింది. ఇనుప కంచెలు తొలగిపోవడంతో జనం క్యాంప్ కార్యాలయం వద్ద అర్జీలతో వేచి చూస్తున్నారు..
సీఎం రేవంత్ ప్రకటించీ ప్రకటించక మునుపే ప్రజాదర్బార్‌కి జనం క్యూ కట్టారు. తెల్లవారు జాము నుంచే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ప్రజలు తమ బాధల్ని చెప్పుకునేందుకు బారులు తీరారు. ప్రగతీ భవన్ ప్రజాభవన్‌గా మారింది. ఇనుప కంచెలు తొలగిపోవడంతో జనం క్యాంప్ కార్యాలయం వద్ద అర్జీలతో వేచి చూస్తున్నారు.. నేడు, జ్యోతిరావు పూలే అంబేద్కర్ ప్రజా భవన్(ప్రగతి భవన్)లో నేటి నుంచి ప్రజా దర్బార్‌ను నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రజా దర్బర్ నిర్వహించనున్నారు. ఈ ప్రజాదర్బార్‌లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొననున్నారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ తొలి అడుగు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఎన్నికల సమయంలో రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇక, విద్యుత్‌పై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. సెక్రటేరియట్‌లో విద్యుత్ శాఖపై మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేపట్టనున్నారు. సీఏండీ ప్రభాకర్ రావును రివ్యూకు అటెండ్ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సంస్థలో 85వేల కోట్ల అప్పులపై ఆరా తీయనున్నారు. నేడు సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మరోవైపు, విద్యుత్ సంక్షోభం సృష్టించే కుట్ర జరిగిందని తొలి క్యాబినెట్ సమావేశంలో వ్యాఖ్యానించిన సీఎం రేవంత్. అయితే, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.