తెలంగాణ అసెంబ్లీకి తొలి దళిత స్పీకర్ ప్రసాద్ కుమార్
తెలంగాణ మూడో శాసనసభకు స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో ఆయన పేరును గురువారం ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ
తెలంగాణ మూడో శాసనసభకు స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో ఆయన పేరును గురువారం ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధికారికంగా ప్రకటించారు. తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి ఏపీలో స్పీకర్‌గా ప్రతిభా భారతి ఉన్నారు. తర్వాత ఆ అవకాశం ప్రసాద్‌కు దక్కింది.
వికారాబాద్ నుంచి గెలిచిన ప్రసాద్‌కుమార్ బుధవారం మధ్యాహ్నం స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌తో పాటు, ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలపడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అధికార పార్టీ తరపున సీఎం రేవంత్ కూడా ఆయన పేరునే ప్రతిపాదించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం, సీపీఐ ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 111 మంది స్పీకర్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలపలేదు.
Next Story