తెలంగాణ రెండో సీఎంగా రేవంత్‌ ప్రమాణ స్వీకారం
x

తెలంగాణ రెండో సీఎంగా రేవంత్‌ ప్రమాణ స్వీకారం

‌తెలంగాణ రాష్ట్రానికి రేవంత్‌ ‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మినిట్‌ ‌టు మినిట్‌ ఏం ‌జరిగిందంటే..


తెలంగాణ రెండో సీఎంగా ఎనుముల రేవంత్‌ ‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ ‌తమిళసై ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం భట్టి విక్రమార్క, ఉత్తం కుమార్‌ ‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ శ్రీధర్‌ ‌బాబు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుతో గవర్నర్‌ ‌విడివిడిగా ప్రమాణం చేయించారు.

హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున ఖడ్గే విచ్చేశారు. కర్ణాటక నుంచి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ‌హాజరయ్యారు.

వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, ప్రజల మధ్య ప్రమాణ స్వీకారోత్సవం విజయవంతంగా ముగిసింది.

వేదికపై మినిట్‌ ‌టు మినిట్‌ ఏం ‌జరిగింది..

1.12గంటలకు సోనియా, రాహుల్‌, ‌ప్రియాంక, మల్లికార్జున ఖడ్గే ఎల్బీ స్టేడియం చేరుకుని వేదికపైకి వెళ్లారు.

1.15: గవర్నర్‌ ‌తమిళపై వేదికపైకి చేరుకున్నారు.

1.18 : జాతీయ గీతాలాపానతో ప్రమాణ స్వీకారోత్సవం మొదలైంది.

1.20: రేవంత్‌ ‌రెడ్డితో గవర్నర్‌ ‌తమిళసై ప్రమాణం స్వీకారం

1.23: ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్‌ ‌రెడ్డి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌. ‌రేవంత్‌ ‌కూడా ఆమెకు పుష్ప గుచ్ఛం అందజేశారు.

1.24 : డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భట్టి విక్రమార్క

1.27: ప్రమాణ స్వీకారం చేసిన ఉత్తం కుమార్‌ ‌రెడ్డి

1.29 : ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేసిన దామోదర రాజనర్సింహ

1.31: కోమటి రెడ్డి వెంకటరెడ్డి

1.33: ప్రమాణ స్వీకారం చేసిన దుద్దిళ శ్రీధర్‌ ‌బాబు

1.35: ప్రమాణ స్వీకారం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి

1.37 : పొన్నం ప్రభాకర్‌ ‌ప్రమాణ స్వీకారం

1.39 : ప్రమాణ స్వీకారం చేసిన కొండా సురేఖ

1.41 : అనసూయ సీతక్క ప్రమాణ స్వీకారం

1.44 : ప్రమాణ స్వీకారం చేసినతుమ్మల నాగేశ్వరరావు

1.46 : జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం

1.48 : కుటుంబసభ్యులను సోనియాకు పరిచయం చేసిన రేవంత్‌

1.51 : ‌వేదికను వీడిన గవర్నర్‌ ‌తమిళసై

1.55 : డయాస్‌ను వీడిన సోనియా, రాహుల్‌, ‌ప్రియాంక, ఖడ్గే

1.21: రేవంత్‌ ‌రెడ్డి ప్రసంగం

2.10: ముగిసిన సీఎం ప్రసంగం

2.11 : ఆరు గ్యారంటీల అభయ హస్తం ఫైల్‌పై తొలి సంతకం చేసిన రేవంత్‌

2.12 : ‌దివ్యాంగులరాలు రజినికి ఉద్యోగం ఇస్తూ అపాయింట్‌మెంట్‌ ‌లెటర్‌పై సంతకం

Read More
Next Story