రేవంతే తెలంగాణ ముఖ్యమంత్రి

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ క‌మీష‌న‌రేట్ల పరిధిలో భద్రతా ఏర్పాట్లు చేయాలని ఇంటిలిజెన్స్ డీజీపీ ఉత్తర్వులు.


రేవంతే తెలంగాణ ముఖ్యమంత్రి
x

సెంటిమెంట్ రూటు మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్ర‌క‌టించిన‌ కాంగ్రెస్ పార్టీని విజ‌య‌ప‌థం వైపు న‌డిపించ‌డంలో రేవంత్‌రెడ్డి కీల‌క భూమిక పోషించారు. తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ఎవ‌రా అని ఎదురు చూస్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు కొడంగ‌ల్ ఎమ్మెల్యే ఏ.రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా సోమ‌వారం ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నార‌ని అధికారిక స‌మాచారం అందించింది. ఈమేర‌కు ఇంటిలిజెన్స్ అడిషిన‌ల్ డీజీపీ హైద‌రాబాద్ లోని మూడు పోలీసు క‌మీష‌న‌రేట్ల ప‌రిధిలో భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై ఉత్త‌ర్వులు జారీ చేశారు. రేవంత్‌రెడ్డి ప్ర‌మాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ, పార్టీ మాజీ అధ్య‌క్షుడు, ఎంపీ రాహుల్‌గాంధీ, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకాగాంధీ రానున్నారు. వీరితో ప‌లువురు ముఖ్య‌మంత్రులు, ప్ర‌ముఖ వ్య‌క్తులు హైద‌రాబాద్‌కు రానున్నారు. హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ పోలీస్ క‌మీష‌న‌రేల్ల ప‌రిధిలో పూర్తి భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయాల‌ని ఇంటిలిజెన్స్ డీజీపీ ఆదివారం రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీంతో మూడు క‌మీష‌న‌రేట్ల ప‌రిధిలో భ‌ధ్ర‌తా ఏర్పాట్లను పోలీసులు ప్రారంభించారు.


Next Story