రేవంత్‌పై సీతక్క ట్వీట్‌ అదిరిందిగా..
x

రేవంత్‌పై సీతక్క ట్వీట్‌ అదిరిందిగా..

కంగ్రాట్స్.. అం‌టూ ఒకటే ట్విట్లు.. ఇంతలా సోషల్‌ ‌మీడియాలో అభినందనలు అందుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో మీకు తెలిసే ఉంటుంది.. ఆయనే..


రేవంత్‌ ‌రెడ్డిని తెలంగాణ సీఎంగా ప్రకటించారు. సాధారణంగానే ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువ. ఇక సోషల్‌ ‌మీడియాలో అయితే అంతకంటే ఎక్కువ ఫాలోయింగ్‌ ఉం‌ది. కొత్త సీఎంకు కంగ్రాట్స్ అం‌టూ..ట్వీట్లు మొదలయ్యాయి. ఆయన అభిమానులు అటు కొడంగల్‌లో ఇటు హైదరాబాద్‌ ‌గాంధీభవన్‌లో సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా కాలుస్తూ..మిఠాయిలు పంచిపెడుతున్నారు.

ములుగు ఎమ్మెల్యే సీతక్క తన ఆనందాన్ని ఎక్స్ (‌ట్విట్టర్‌)‌లో షేర్‌ ‌చేశారు. రేవంత్‌తో దిగిన ఫొటో పెట్టి...‘‘నా సోదరుడు రేవంత్‌ ‌రెడ్డికి అభినందనలు. నాకు నమ్మకముంది.. మీరు దేశంలోనే పీపుల్స్ ‌మోస్ట్ ‌పవర్‌ఫుల్‌ ‌సీఎంగా ఉంటారు’’ అంటూ చేసిన ట్వీట్‌ ‌సోషల్‌ ‌మీడియాలో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది.







Read More
Next Story