బీఆర్‌ఎస్ చీఫ్ ఇల్లు ఖాళీ చేస్తారా?
తనకు దేశ రాజధాని ఢిల్లీలో కేటాయించిన ఇంటిని కేసీఆర్ ఖాళీ చేస్తారా? ఆ ఇంట్లో ఆయన ఎన్నేళ్లుగా ఉంటున్నారో తెలుసా?
బీఆర్‌ఎస్ చీఫ్..కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్).. ఇప్పుడు మాజీ సీఎం అయిపోయారు. దీంతో ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఉన్న తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్నారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా అదే క్వార్టర్‌లోనే..
2004లో కరీంనగర్ నుంచి టీఆర్‌ఎస్ తరపున ఎంపీగా గెలిచిన కేసీఆర్.. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆయనకు తుగ్లక్ రోడ్డులో టైప్ 8 క్వార్టర్ కేటాయించారు. 2006లో ఎంపీ పదవికి రాజీనామా చేసి.. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా గెలిచి అదే నివాసంలో కొనసాగారు. 2009లో మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా ఎన్నికై అదే క్వాటర్‌లో ఉన్నారు. 2014లో సీఎం అయ్యాక కూడా అక్కడే ఉన్నారు.
ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అధికారిక నివాసాలను కేటాయిస్తుంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌కు క్వాటర్ కేటాయించారు. ఆ తర్వాత ఎంపీగా గెలిచిన ఆయన కుమార్తె కవిత కూడా అదే క్వాటర్‌లో నివాసం ఉన్నారు. తాజా ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమితో సీఎం కేసీఆర్..తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ హస్తినలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్నారు.