తడబడ్డ ఆ మంత్రులెవరు ?
ప్రమాణ స్వీకారోత్సవంలో కొందరు మంత్రులు తడబడ్డారు. సవరించి పలుకుతూ కార్యక్రమాన్ని ముగించేశారు. ఇంతకు తడబడ్డ వారెంతమంది?
సాధారణంగా మనమే నలుగురు ముందు లేచి నిలబడి మాట్లాడమంటే నాలుక తడబడుతుంది. అలాంటిది వేలాది మంది జనం.. వందల సంఖ్యలో కార్యకర్తలు.. వేదికపై అతిరథ మహారధులు. అంతమందిని చూస్తూ.. మైకు ముందు గొంతు విప్పాలంటే కాస్త టెన్షన్‌గానే ఉంటుంది. ఈ తడబాటు కొందరి మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవంలో కనిపించింది.
ఒక్కమాటలో చెప్పాలంటే..సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో కొంతమంది మంత్రులు తడబట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క మాటల్లో తడబాటు కనిపించింది. దామోదర రాజనర్సింహ ఇంగ్లీషులో ప్రమాణం చేయగా మిగతా వారంతా..భట్టి విక్రమార్క, ఉత్తం కుమార్ రెడ్డి,కోమటి రెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ శ్రీధర్ బాబు,పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తెలుగులో ప్రమాణం చేశారు.
Next Story