ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. కేటీఆర్
x
KTR

ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. కేటీఆర్

"ఓటమికి కొద్దిగా నిరాశ చెందాం, కానీ బాధపడట్లే. మళ్లీ లేచి పెరిగెడతాం"


తాము అనుకున్న ఫలితాలు రాకపోవడంతో కార్యకర్తలు భావోద్వేగ సందేశాలు పంపుతున్నారని, బాధపడొద్దని అన్నారు. ఎన్నికలన్న తరువాత రెండే ఉంటాయని చెప్పారు. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని ఓటమిపై కచ్చితంగా రివ్యూ చేసుకుసుకని గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఫలితాల తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. మాకు ఎదురు దెబ్బలు కొత్తకాదు. మా పార్టీ పెట్టిన 23 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నామని వివరించారు.

తమకు అండగా నిలుచున్న 60 లక్షల కార్యకర్తలకు ధన్యావాదాలు చెప్పారు. తెలంగాణలో ఇక ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తామని అన్నారు. గత పది ఏళ్లలో ప్రభుత్వాన్ని నిర్వహించడంలో ఎలాంటి చిత్తశుద్ధిని నిర్వహించామే అలాగే ప్రతిపక్షంలో సమర్థవంతమైన పాత్ర పోషిస్తామని అన్నారు. ప్రభుత్వం కుదురుకోవడానికి తగిన సమయం ఇస్తామని చెప్పారు. తమ అసలు లక్ష్యమైన తెలంగాణనే సాధించామని, ప్రజల దయతో ఓ దశాబ్దం అధికారం అనుభవించామని పేర్కొన్నారు. ఎక్కడ కొల్పోయామే అక్కడే వెతుక్కుంటామని వివరించారు. తెలంగాణ ప్రజల మన్ననలు తిరిగి పొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read More
Next Story