పశ్చిమ బెంగాల్ ఎంపీపై బహిష్కరణ వేటు
‘క్యాష్-ఫర్-క్వరీ’ కుంభకోణం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆందోళన కలిగించే అంశం. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా
‘క్యాష్-ఫర్-క్వరీ’ కుంభకోణం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆందోళన కలిగించే అంశం. పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా టీఎంసీ క్రిష్ణానగర్ ఎంపీ మోయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మోయిత్రాను బహిష్కరించడంతో ఆమె కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
జ్యోతిబసు మమతాకు ‘చేసిన’ పనిని బీజేపీ మహువా మొయిత్రాకు చేస్తోందా?
పశ్చిమ బెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (Mamata Banarjee) రాజకీయంగా ఎదగడానికి దివంగత జ్యోతి బసు ఒక విధంగా దోహదపడ్డారని చాలా మంది రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆ రోజుల్లో ఎందరో పేరుమోసిన కాంగ్రెస్ నాయకులు బెంగాల్ లో ఉన్న తనకు ఇబ్బంది కలిగిస్తున్నది మమతా బెనర్జీ వల్లే నని ఆయన అనుమానించారు.ఆమెనే టార్గెట్ చేశారు. జ్యోతి బసు వంటి నేత కంటపడి మమతా బెనర్జీ బెంగాల్ స్టార్ అయి కూర్చుకున్నారు. ఆమె తర్వాత్తర్వాత ఎంత గా ఎదిగారంటే పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్ట్ కోటను తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటగా మార్చుకున్నారు. ఒక సాధారణ ఎంపి మహువా నుంచి తనకేదో కొంపలటుకుపోయే ప్రమాదమున్నట్లు బీజేపీ భావిచడమంటే మరొక బెంగాల్ స్టార్ ను తయారు చేస్తున్నట్లే ననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
‘క్యాష్ ఫర్ క్వెరీ’ ఆరోపణలపై మోయిత్రా బహిష్కరణ అకాలమైంది. పదవీకాలం ముగియడానికి కేవలం నెలల సమయం మాత్రమే ఉంది. ఎన్‌డీఏ ఆధిపత్యం ఉన్న లోక్‌సభ ఎథిక్స్ కమిటీ.. తన నివేదికను శుక్రవారం (డిసెంబర్ 8) లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాయిస్ ఓటు ద్వారా మోయిత్రా బహిష్కరణ జరిగిపోయింది.
మోయిత్రాకు ఇండియా కూటమి మద్దతు..
మూడు రాష్ట్రాల్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శన చూపింది. కూటమిలో అసమ్మతి ఉన్నా.. ఇండియా అలయన్స్ నాయకులు మోయిత్రాకు మద్దతుగా నిలిచారు. సోనియా నేతృత్వంలోని ప్రతిపక్ష శిబిరం మొత్తం మోయిత్రా బహిష్కరణకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలిపింది. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర సమావేశమైంది. ఇది కూటమి ఐక్యతకు నిదర్శనం. మొయిత్రా ఇండియా కూటమిలో ప్రముఖ వ్యక్తిగా ఉండటం..ఆమె బహిష్కరణ రాజకీయ కారణాలతో జరిగిందని భావించిన ఇండియా ఆలయన్స్ నాయకులు మోయిత్రాకు పూర్తిస్థాయి మద్దతు తెలిపారు.
రాజకీయ వ్యాఖ్యాత, సీనియర్ జర్నలిస్ట్ శిఖా ముఖర్జీ మాట్లాడుతూ.. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో ప్రధాని మోదీకి సంబంధాలున్నాయనడంతో మోయిత్రా బలిపశువు అయిందని, ప్రతిపక్షాలకు రాజకీయ చిహ్నంగా మారిందని పేర్కొన్నారు.
ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మొయిత్రాను మందలించారు. మొయిత్రా తీరు పార్టీపై పడుతుందన్న వార్తలు కూడా వచ్చాయి. గత ఏడాది కాళీ మాతపై మోయిత్రా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను టీఎంసీ ఖండించింది. ‘క్యాష్ ఫర్ క్వెరీ’ ఆరోపణలపై టీఎంసీ మొదట సంకోచించినా..తర్వాత మొయిత్రాకు మమతా మద్దతు ఇచ్చారు. గత నెలలో పార్టీ కృష్ణానగర్ జిల్లా విభాగానికి అధ్యక్షురాలుగా ఎంపిక చేశారు కూడా. దీనికి కారణమేమిటి, మహువాను టార్గెట్ చేసి బిజెపి ఆమె ఎదిగేందుకు దోహదపడుతూ ఉందని, అందువల్ల ఇపుడు ఆమెకు దూరంగా జరగడం సరికాదని తృణ ూల్ గుర్తించడమే.
కృష్ణానగర్ నదియా జిల్లాకు జిల్లా కేంద్రం. ఇక్కడి నుంచి వలసలు వెళ్లే వారి సంఖ్య ఎక్కువ. ఈ జిల్లా టీఎంసీకి చాలా కీలకం. ఎందుకంటే బీజేపీ తన బలాన్ని పెంచుకోవడానికి వలసల సమస్యను నిరంతరం తెరమీదకు తెస్తుంది.
‘‘ప్రతీకార రాజకీయాలను వ్యతిరేకించడంలో ఇండియా కూటమి మోయితాకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. అన్యాయం చేసిన బీజేపీకి ప్రజలు తగిన సమాధానం చెబుతారన్నారు. మహువా గెలుస్తారు (ప్రజల కోర్టులో జరిగే యుద్ధం)’’ అని బెనర్జీ అన్నారు.
రాబోయే పార్లమెంటరీ ఎన్నికల్లో మోయిత్రా నామినేషన్ గురించి అడిగినప్పుడు, ‘‘ఆమెను మార్చడానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదని టీఎంసీ సుప్రీమో బదులిచ్చారు.
‘‘వివాదం తర్వాత, మోయిత్రా ఒక ప్రముఖ బీజేపీ వ్యతిరేక శక్తిగా రూపాంతరం చెందారు. ఉదారవాద ప్రముఖులు ఆమెను ప్రశింసించారు. ఆమె ఇప్పుడు నిజమైన నాయకురాలిగా స్థిరపడే అవకాశం ఉంది’’ అని రాజకీయ వ్యాఖ్యాత, రచయిత అమల్ సర్కార్ పేర్కొన్నారు.
రాబోయే 30 ఏళ్లపాటు బీజేపీతో పోరాడతానని మొయిత్రా ప్రతిజ్ఞ ..
‘‘నా వయసు 49 సంవత్సరాలు. వచ్చే 30 ఏళ్ల పాటు పార్లమెంటు లోపల, బయట, వీధుల్లో మీతో పోరాడతాను. మీ అంతు చూస్తాం,’’ అని మోయిత్రా చెప్పడంతో ఆమెను ఇండియా అలయన్స్ కూటమి అభినందించింది. మోయిత్రా వాడిన ఘాటైన పదాలు కార్యరూపం దాల్చడం అంత సులభం కాదు.
‘క్యాష్-ఫర్-క్వరీ’ ఏమిటి?
మోయిత్రా(Mahua Moitra) తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ. ఆ పార్టీలో కీలక నేత. క్రిష్ణానగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. పారిశ్రామిక వేత ఆదానీని టార్గెట్ చేస్తూ మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టే ప్రయత్నం చేశారు. అదానీతో మోదీకి సంబంధాలున్నాయని పార్లమెంట్‌లో గళం విప్పారు. బీజేపీ(BJP) ఎంపీ నిషాంత్ దూబే మోయిత్రాపై లోక్‌సభ స్వీకర్ ఓం ప్రకాశ్‌కు ఫిర్యాదు చేశారు.
వ్యాపారవేత్త దర్శన్ హిరానందిని నుంచి మోయిత్రా భారీగా డబ్బులు, గిప్టులు తీసుకుని.. తనకు కేటాయించిన పార్లమెంట్ లాగిన్ ఐడీకి ఆయనకు ఇవ్వడంతో అదానీ, అదానీ గ్రూపులకు వ్యతిరేకంగా ప్రశ్నలు పోస్టు చేశాడన్న ఆరోపణలు ఇప్పుడు మోయిత్రాను వెంటాడుతున్నాయి.