సాయంత్రం 4 గంటలకే అక్కడ పోలింగ్ ముగించేశారు....

మావోయిస్టులు ఈ ఎన్నికలను బహిష్కరించాలంటూ బుధవారం సాయంత్రం లేఖ విడుదల చేయడంతో ఐదు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు.


సాయంత్రం 4 గంటలకే అక్కడ పోలింగ్  ముగించేశారు....
x
Public waiting for their vote casting in Secunderabad.


తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా 4 గంటలకే పోలింగ్ ముగిసింది. ముఖ్యంగా మావోయిస్టులు ఈ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించాలంటూ బుధ‌వారం సాయంత్రం లేఖ విడుద‌ల చేయ‌డంతో ఐదు అంచెల భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. అత్యంత స‌మ‌స్యాత్మ‌కమైవ‌నిగా గుర్తించిన 13 నియోజ‌క‌వ‌ర్గాల్లో సాయంకాలం 4 గంట‌ల‌కే పోలింగ్ ముగిసింది. సాయంత్రం నాలుగు గంట‌ల‌కు పోలింగ్ ముగిసిన నియోజ‌క‌వ‌ర్గాలు సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం ఉన్నాయి.

నిరాశాజ‌న‌కంగా పోలింగ్ స‌ర‌ళి :

తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ ఉద‌యం మంద‌కొండిగా ప్రారంభమైన‌ప్ప‌టికీ మ‌ధ్యాహ్నం కాస్తం పుంజుకున్న‌ట్లు క‌నిపించింది. తెలంగాణ లోని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ స‌ర‌ళి అనూహ్యంగా పెరిగిన‌ప్ప‌టికీ, ప‌ట్ట‌ణ ప్రాంత ఓట‌ర్లు మాత్రం పెద్ద‌గా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌క‌పోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 2018లో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కూ 62% పోలింగ్ న‌మోదైంది. కానీ ఇప్ప‌టి ఎన్నిక‌ల్లో మ‌ద్యాహ్నం 3 గంట‌ల‌కు కేవ‌లం 51.8% మాత్ర‌మే ఓటింగ్ శాతం న‌మోదు కావ‌డం పార్టీనేత‌ల్లో ఆందోళ‌న క‌లుగుతోంది. 2018లో మొత్తం పోలింగ్ శాతం 73.73% కాగా, ఈసారి కేవ‌లం 65% పోలింగ్ న‌మోదు అయ్యే అవ‌కాశాలు లేవ‌ని అనుమానం ప‌లువురు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

హైదరాబాద్ సిటీ లో ఒక్కసారి గా పెరిగిన ఓటింగ్ శాతం

హైదరాబాద్ లోని ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గాల్లో దాదాపు అన్ని పోలింగ్ బూత్ లలో చివరి గంటలో భారీగా ఓటు వేసేందుకు క్యూ లైన్ లోకి వచ్చిన ఓటర్లు. ఇక్క‌డ పోలింగ్ రాత్రి 7- 8 గంటల వరకు కొనసాగే అవకాశం ఉన్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. మంథని నియోజకవర్గంలో పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 71.24 శాతం ఓటింగ్ నమోదు. మెజారిటీ బూత్‌ల వద్ద ఇంకా క్యూ లైన్లలో ఓటర్లు ఉన్నారు. 4 గంటల లోపు క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని అంటున్న అధికారులు. ఖమ్మం జిల్లా తో పాటు మరికొన్ని జిల్లాలలోనీ సమస్యఆత్మక ప్రాంతంలో దాదాపు ఇప్పటికే ఎన్నికలు పూర్తి. చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం. క్యూ లైన్లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అనుమతి. వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీగా క్యూలైన్లు. క్యూ లైన్లో ఉన్నవారికి మాత్రమే ఒటు వేసేందుకు అనుమతి. చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం.

Next Story