తుపాల్ తూచ్.. నాది లోకలే
x
తెలంగాణ సీఎం కేసీఆర్

తుపాల్ తూచ్.. నాది లోకలే

దేశ్ కీ నేతగా పిలుచుకునేందుకు అనేక కసరత్తులు చేసి, దేశంలో చక్రం తిప్పాలని కలలుకన్న నేత హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించాడు. దేశంలో వేల టీఎంసీలు నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని ప్రసంగాలు.. ప్రస్తుతం ఉన్న పార్టీలకు పాలించడం రాదని, కొత్త విధానాలు, నాయకత్వం కావాలని చెప్పారు. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లలో దేశాన్ని పాలిచ్చింది కాంగ్రెస్, బీజేపీలే అంటూ పక్క రాష్ట్రాల్లోకెళ్లి మరీ దుమ్మెత్తి పోశాడు.


దేశ్ కీ నేతగా పిలుచుకునేందుకు అనేక కసరత్తులు చేసి, దేశంలో చక్రం తిప్పాలని కలలుకన్న నేత హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించాడు. దేశంలో వేల టీఎంసీలు నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని ప్రసంగాలు.. ప్రస్తుతం ఉన్న పార్టీలకు పాలించడం రాదని, కొత్త విధానాలు, నాయకత్వం కావాలని చెప్పాడు. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లలో దేశాన్ని పాలిచ్చింది కాంగ్రెస్, బీజేపీలే అంటూ పక్క రాష్ట్రాల్లోకెళ్లి మరీ దుమ్మెత్తి పోశాడు.

సీన్ కట్ చేస్తే ఇది నేను, నా చీమలు పెట్టిన పుట్ట.. మీరంతా ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అంటూ.. గగ్గోలు, అరుపులు కలిపి పెడుతున్నాడు.. నేను దేశ్ కీ నేతను కాను.. లోకల్ నంటూ ఎన్నికల బరిలో దిగాడు.. ఈ ఉపోద్ఘాతం ఎవరి కోసం అనుకుంటున్నారా. . ఈపాటికీ మీకు అర్థమయ్యే ఉంటుంది.. అదే.. తెలంగాణ సీఎం కేసీఆర్ గురించే

తెలంగాణ అసెంబ్లీ బరిలో ఉన్న కేసీఆర్ సడన్ గా రూట్ మార్చారు. ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చేందుకు తెలంగాణ వాదాన్ని మరోసారి తలకెత్తుకున్నారు. నవంబర్ 13 నుంచి రెండో విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించిన గులాబీ దళపతి.. ఖమ్మం, వరంగల్ జిల్లాలో నిర్వహించిన సభల్లో ప్రచారం చేస్తూ, పక్క రాష్ట్రాలను పేరుపేరూన గుర్తు చేస్తూ తనదైన శైలిలో రాళ్లు విసిరారు. లుంగీ ఎత్తుకుని లింగు లింగు మంటూ వచ్చే యూపీ సీఎం యోగీ.. రాష్ట్రంలో గంగానదీ పారుతున్నప్పటికీ, మంచినీళ్లు ఇవ్వడంలో విఫలం అయ్యారని వెక్కిరించారు.

ఇటూ ఆంధ్ర ప్రదేశ్ ను కూడా ఎన్నికల ప్రచారంలోకి లాగిన సీఎం కేసీఆర్.. సింగల్ రోడ్ ఉంటే ఆంధ్ర, డబుల్ రోడ్ ఉంటే తెలంగాణ అంటూ విమర్శించారు. దీంతో అక్కడి అధికార పార్టీ కేసీఆర్ పై గుస్సా అయింది. వైఎస్ షర్మిలా, నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్ ను ఓడించడానికి నోట్ల కట్టలను పంపిస్తోందని, తెలంగాణ మంచినీళ్లే గెలవాలని ప్రజలకు హితబోధ చేశారు. మరో వైపు కర్నాటక కాంగ్రెస్ నేతలు మందలుగా వస్తున్నారని, వాళ్లకు తెలంగాణలో ఏం పనంటూ గులాబీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. సింహం సింగల్గా వస్తుందంటూ ఓ తమిళ సూపర్ హిట్ సినిమా డైలాగ్ ను ఆ పార్టీ నేతలు పదేపదే వాడుతూ ఉండడం ఇక్కడ గమనించదగ్గ విషయం. అయితే తాను మాత్రం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి జేడీఎస్ కి మద్ధతు ప్రకటించి, ఆ రాష్ట్రం లో వేలు పెట్టిన సంగతి మరిచిపోయారు. అంతేలే ఎంటికలున్న కొప్పు ఎటేసినా సక్కగుంటది.

కొన్ని నెలల క్రితం మరాఠా గడ్డపై సభలు నిర్వహించి మరీ తాను దేశ్ కీ నేత అంటూ ప్రచారం చేసుకున్న సీఎం కేసీఆర్, మహ స్థానిక సంస్థలకు జరిగినట్లు చెప్పుకుంటున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచినట్లు గులాబీ మీడియా ఆ మధ్య ప్రచారంతో హోరెత్తించింది. ఇటూ ఒడిషాలోను బీఆర్ఎస్ శాఖ ఒకటి ప్రారంభించారట. అప్పడెప్పుడో వాజ్ పేయ్ ని ఒక్క ఓటుతో ఓడించిన గిరిధర్ గమాంగ్ ని దీనికి అధ్యక్షుడిగా పెట్టుకున్నారట. కానీ కాలం అంతా ఒక్కలా ఉండదు కదా.. ‘తెలంగాణ’ భవన్ ఒక్కసారిగా బీటలువారుతున్నట్లు గుర్తించిన కార్... వెంటనే రివర్స్ గేర్ వేసి ఢిల్లీ పర్యటనను వాయిదా వేసి, వచ్చిన దారిలోనే వేగంగా వెనుదిరిగే ప్రయత్నం చేస్తోంది. తమ బండి కండిషన్ బాగా లేనట్లు, గ్యారేజ్ కి వెళ్తామేమో అన్న ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే సడన్ గా స్థానిక వాదాన్ని ఎత్తుకున్నారా అనే అనుమానం వస్తోంది.

Read More
Next Story