రెండు రెళ్లు ఆరు
x
విజయశాంతి, మాజీ ఎంపీ

రెండు రెళ్లు ఆరు

ఔమల్లా.. మన రాములక్క.. మళ్లీ అలిగిందట.. ఎందుకు గుస్సా అవుతుందో.. ఎవరికి అర్థం అయితలేదట.. ఎందుకో మరీ. ఈ మధ్య రాజకీయ ప్రచారంలో కన్నా.. పార్టీ మారే ప్రచారంలోనే రాములమ్మ పేరు ఎక్కువగా వినబడుతోంది.


తొంభైల్లో పాత సినిమాల్లో ఓ ఫార్ములా ఉండేది. దానికే విజయవంతమైన సూత్రం అనే పెద్ద పేరూ కూడా . అయితే దాంట్లో కథానాయికలకు సరైన ప్రాధాన్యం లేదన్నది వాస్తవం. ఇలాంటి వాటి మధ్య ఉంటూ కథానాయిక బలమున్నా పాత్రలతో ఫైర్ బ్రాండ్ అన్న పేరు తెచ్చుకుంది లేడీ సూపర్ స్టార్. అదే ఊపులో రాజకీయ అరంగ్రేటం చేసింది. అయితే ఇందులో మాత్రం మన భారతక్క పాత తెలుగు సినిమాలో విజయవంతమైన ఫార్ములాను ఉపయోగించిదనే తెలుస్తోంది.

ఇప్పటికే మూడు పార్టీలు.. ఐదు సార్లు జంపింగ్ లు, ఓ సొంత పార్టీలతో రాములమ్మ.. హనుమంతుల వారిని ఫాలో అవుతోంది.. ప్రతి సీన్ కి కాస్ట్యూమ్ చేంజ్ చేసినట్లు.. ఎన్నికలు అనగానే పార్టీలు చేంజ్ చేస్తోంది లేడీ అమితాబ్. ఎప్పుడు ఏ పార్టీలో చేరతారో ఎవరికి అంతుబట్టట్లేదు.

కర్తవ్యం సినిమా గుర్తుకు వస్తే.. కర్తవ్యపథ్ కి, ప్రతిఘటన యాదోస్తే ప్రగతి భవన్ కు, రాములమ్మ సినిమా చూస్తే టెన్ జన్ పథ్ కి ఫైర్ బ్రాండ్ పరుగులు పెడుతోంది. సొంతంగా ఎదగాలని అనుకుని పార్టీ పెడితే. ఇంకేదో అయింది. ఇక రాజకీయాలు చాలు అన్నట్లు అప్పట్లో అలిగి ఇంట్లోనే ఉండిపోయింది. అయినా మళ్లీ ఎందుకో ఆక్టివ్ అయింది. ఇంతలోనే పార్టీ మారుతున్న అంటూ బ్రేకింగ్లు.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో తనకు పొసగట్లేదు.. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఓ ఆరోపణ. స్టార్ ని అయి ఉండి.. స్టార్ క్యాంపెయిన్లో చోటు లేకపోవడం ఏంటట. ఇవన్నీ పార్టీ మారడానికి దారులు అయ్యాయట.

విజయశాంతి రాజకీయ జీవితం బీజేపీలోనే మొదలైంది. 1998లో ఆమె బీజేపీలో చేరారు. అప్పట్లో సింహపురీలో నిర్వహించిన సభలో లేడీ సింగంలా గర్జించారు. వాజ్ పేయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. అలా కొన్నేండ్ల తరువాత ఏమనుకుందో ఏమో ‘తల్లి తెలంగాణ’ అంటూ సొంతంగా పార్టీ స్థాపించారు. తరువాత దాన్ని తీసుకెళ్లి కేసీఆర్ చేతుల్లో పెట్టారు. అలా 2009లో మెదక్ ఎంపీగా గెలుపొంది.. బ్యాలెట్ గ్రేటం చేసి, చారిత్రకంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో ఓ భాగం అయ్యారు.

తరువాత మళ్లీ కేసీఆర్ తో విభేదాలు వచ్చి కాంగ్రెస్ లో చేరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2018లో మరోసారి ఓటమి, 2020లో తిరిగి బీజేపీలో చేరారు. మూడు ఏళ్లు కాకుండానే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇలా రాములమ్మ రాజకీయ జీవితం మూడు విభేదాలు.. ఆరు పార్టీలన్నట్లు కొనసాగుతోంది. కానీ కొసమెరుపు ఏంటంటే.. రాములమ్మ ఎక్కడికెళ్లినా.. ఆమే ఓ సైన్యం. వివరంగా చెప్పలేను, అర్దమైందని ఆశిస్తున్నాను.

Read More
Next Story