సీఎం రేవంత్‌ రెడ్డి అక్కడ ఉండడం లేదా?
x

సీఎం రేవంత్‌ రెడ్డి అక్కడ ఉండడం లేదా?

గతంలో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ఎక్కడంటే చటుక్కున చెప్పేవాళ్లం. కాని ఇప్పుడు అడ్రస్‌ చెప్పాలంటే కాస్త కష్టమే..


పాత సీఎం కేసీఆర్‌ (KCR) పోయి కొత్త సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) వచ్చారు. స్థానం మారింది. అలాగే బీఆర్‌ఎస్‌ (BRS) చీఫ్‌ గతంలో ఉన్న ఇంట్లోనే.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ ఉంటారని అందరూ భావించారు. కాని అలా జరగలేదు. ఆయన మరో చోట ఉండబోతున్నారు.

బేగంపేటలో నిర్మించిన ప్రగతి భవన్‌ (Pragathi Bhaven) గత సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసం. అయితే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక దాన్ని మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌(Praja Bhavan)గా పేరు మార్చారు. ఈ మధ్య సీఎం రేవంత్‌ అందులో తొలి ప్రజాదర్బార్‌ కూడా నిర్వహించారు. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణిని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇపుడు అదే ప్రజాభవన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటాయించారు. అందులో ఆయన నివాసం ఉండబోతున్నారు.

దీంతో సీఎం క్యాంపు కార్యాలయం కోసం అధికారులు అన్వేషణ మొదలుపెట్టారు. ఎంసీహెచ్‌ఆర్డీ భవనంలో సీఎం అధికారిక నివాసం ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read More
Next Story