ఈ ముగ్గురిలో ముఖ్యమంత్రి ఎవరో...?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీఎం ఎవరనేది నిర్ణయించాలంటే ఏఐసీసీ అధిష్టానం నుండి ఆదేశాలు రావాల్సిందేనని మరికొందరు చెబుతున్నారు.
మహిళా ముఖ్యమంత్రి అయితే సీతక్కేనా..?
రేపు హైదరాబాద్‌కు ఏఐసీసీ హైకమాండ్
రేపు ఉదయం 9 గంటలకు సీఎల్పీ సమావేశం
కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమను ఆహ్వానించాల్సిందిగా కోరేందుకు రాత్రి డీ.కే.శివకుమార్, మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లారు. పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను రాష్ట్ర గవర్నర్‌కు అందజేశారు. అంతకు ముందు ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క్ మీడియాకు చెప్పారు. ఇప్పటికే ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా భట్టివిక్రమార్క్, హోంశాఖ మంత్రిగా సీతక్క అంటూ షోషల్ మీడియాలో ఒక పోస్టు చక్కర్లు కొట్టింది. గత మూడేళ్లుగా పార్టీని విజయం దిశగా నడిపించడంలో పూర్తి పట్టు సాధించిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డే ముఖ్యమంత్రి కావాలంటూ ఎక్కువశాతం మంది ఎమ్మెల్యేలు చెబుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ సీఎం ఎవరనేది నిర్ణయించాలంటే ఏఐసీసీ అధిష్టానం నుండి ఆదేశాలు రావాల్సిందే నని మరికొందరు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, శాసనసభాపక్ష నేత భట్టివిక్రమార్క్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా మహిళను ఎంపిక చేయాల్సి ఉంటు... అది ములుగు నియోజకవర్గం నుండి గెలుపొందిన సీతక్క పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత 20 ఏళ్లుగా ములుగు నియోజకవర్గంలోని ప్రజలతో సీతక్క కలిసిమెలసి ఉన్నారు. కరోనా, వరదల సమయంలో స్వయంగా కరోనా వ్యాధితో ఇబ్బందిపడ్డ వారికి సహాయం అందించారు. వరదలతో సర్వం కోల్పోయిన వారికి తానే అన్నీ అయ్యి చూసుకున్నారు. దీనికి తోడుగా కాంగ్రెస్ పార్టీలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. రాహుల్‌గాంధీ ఇప్పటికే దేశంలో ఎక్కువ మంది మహిళా ముఖ్యమంత్రులను అందించింది తామేనని చెప్పారు. ఎన్నికల ప్రచార సభల్లోనూ మహిళా ముఖ్యమంత్రిని చేస్తామంటూ రాహుల్, రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణాలో మహిళా అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే... సీతక్కకే ఆ పదవి దక్కే అవకాశలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు అన్నారు.
రాజభవన్ కు కాంగ్రెస్ పార్టీ పెద్దలు
ఎంతో ఉత్కంఠ భరితమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొత్తం 119 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 65, బీఆర్ఎస్ 39, బీజేపీ, 8, ఎంఐఎం 7 స్థానాలు గెలుపొందాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన పూర్తి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ సాధించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో హోటల్ ఎల్లాలో గెలుపొందిన పార్టీ ఎమ్మెల్మేలతో సీఎల్‌పీ సమావేశాన్నిసోమవారం ఉదయం 10.30కు జరగనుంది. రాష్టంలో గెలుపొందిన పార్టీ ఎమ్మెల్యేలంతా ఈ రాత్రికి హైదరాబాద్‌కు చేరుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీంతో ఒక్కొక్కరు హోటల్ ఎల్లాకు చేరుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రయను మొదట్నుంచీ దగ్గరుండి పరిశీలిస్తున్న కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డి.కే.శివకుమార్, ఏఐసీసీ కార్యదర్శి మాణిక్‌రావు ఠాక్రేలతో పాటు ఏఐసీసీ అధిష్టానం నుండి మరికొందరు హాజరయ్యే అవకాశాలున్నాయి. కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ రాజీనామాను రాష్ట్ర గవర్నర్ తమిళ్‌సైకి అందజేశారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్ర గవర్నర్ కాంగ్రెస్‌పార్టీని ఆహ్వానించాల్సి ఉంది.
ఈనెల 9న మంత్రివర్గ విస్తరణ :
ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రులుగా ఉత్తమకుమార్‌రెడ్డి, లేదా భట్టివిక్రమార్క లో ఒకరు సోమవారం ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. అయితే ఉదయం జరిగే సీఎల్పీ సమావేశంలో శాసనసభాపక్ష నేతలను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపిక చేయాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తెలంగాణాలో విజయం సాధిస్తుందని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కొత్త ప్రభుత్వం సోనియాగాంధీ పుట్టిన రోజైన డిసెంబరు 9న ప్రజల సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తుందన్నారు. ఆయన చెప్పినట్టే ఈనెల 9వ తేదీన సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్‌లో జరిగే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బహిరంగ సభకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, డీ.కే.శివకుమార్, మాణిక్‌రావు ఠాక్రేతో పాటు పలువురు ఏఐసీసీ మెంబర్లు హాజరవుతారు.