ఎవరిని గెలిపిస్తారో? రాజస్థాన్ ఉత్కంఠ
x
ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న మహిళలు (ఫైల్)

ఎవరిని గెలిపిస్తారో? రాజస్థాన్ ఉత్కంఠ

రాజస్థాన్‌లో ఓటర్ల నాడీ అంతుచిక్కడం లేదు. పోలింగ్‌ శాతం ఈ సారి కాస్త పెరగడంతో ఓటింగ్‌ సరళి అంచనా వేయడం కష్టమైంది. నాయకులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


రాజస్థాన్‌ (Rajastan) లో శనివారం పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 74 శాతం కంటే ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

199 స్థానాల్లో 5.25 కోట్ల ఓటర్లు ఉండగా..1,862 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

యువకులు, వృద్ధులతో సహా మహిళలు, పురుషులు ఉదయం 7 గంటలకే పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. సాయంత్రం ఆరింటికి ఓటింగ్‌ శాతం 74.96గా నమోదైందని ఎన్నికల సంఘం అధికారి తెలిపారు.

సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ శాతం 68.24. జైసల్మేర్‌ జిల్లాలో అత్యధిక పోలింగ్‌ నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో హనుమాన్‌గఢ్‌, ధోల్‌పూర్‌ జిల్లాలు ఉన్నాయని చెప్పారు.

51వేల పోలింగ్‌ కేంద్రాలు..

రాజస్థాన్‌లో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 199. పోలింగ్‌ కేంద్రాలు 51వేలు. వీటిలో ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే అప్పటికే పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలో నిలుచున్న ఓటర్లను ఓటింగ్‌కు అనుమతించినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

గతంలో కంటే కాస్త ఎక్కువ..

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 74.06 శాతం ఓటింగ్‌ నమోదైంది. అయితే ఈసారి ప్రతి నియోజకవర్గంలో కనీసం 75 శాతం నమోదు కావాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది.

పోలింగ్‌ వాయిదా..

శ్రీగంగానగర్‌లోని కరణ్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మృతి చెందారు. దీంతో అక్కడ పోలింగ్‌ వాయిదా పడిరది.

ఇద్దరి మృతి..

పాలీ, ఉదయ్‌పూర్‌ జిల్లాల్లో ఇద్దరు చనిపోయారని అధికారులు తెలిపారు. సుమేర్‌పూర్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యరి జోరారం కుమావత్‌ పోలింగ్‌ ఏజెంట్‌ శాంతి లాల్‌, మరో ఓటరు సత్యేంద్ర (62) అరోరా పోలింగ్‌ కేంద్రాల వద్ద అనుమానాస్పదంగా మరణించారని పేర్కొన్నారు.

చెదురుముదురు ఘటనలు...

దీగ్‌ జిల్లా సాన్లేర్‌ గ్రామంలో జరిగిన రాళ్లదాడిలో ఒక పోలీసుతో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ‘‘గుంపును చెదరగొట్టేందుకు మా సిబ్బంది గాల్లోకి 12 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనతో ఓటింగ్‌కు కొన్ని నిమిషాల పాటు అంతరాయం ఏర్పడిరది’’ అని డీగ్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ బ్రిజేష్‌ ఉపాధ్యాయ్‌ తెలిపారు. సికార్‌లోని ఫతేపూర్‌లో రెండు గ్రూపులు ఘర్షణ పడడంతో ఒక జవాన్‌ గాయపడ్డాడు.

ధోల్‌పూర్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రం బయట పోలింగ్‌ ఏజెంట్‌కి, ఓ వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది.

అనంతరం జరిగిన ఘర్షణలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో కొంతసేపు పోలింగ్‌ నిలిచిపోయింది. టోంక్‌ జిల్లాలోని ఉనియారాలో 40-50 మంది పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని, అయితే పరిస్థితి అదుపులోకి తెచ్చామని పోలీసు సూపరింటెండెంట్‌ రాజర్షి రాజ్‌ తెలిపారు.

మేమే ఫస్ట్‌..

‘‘నేను ఉదయం ఆరింటికే రెడీ అయి నా ఫ్రెండ్స్‌తో పోలింగ్‌ కేంద్రానికి వచ్చా. అందువల్ల మేమే మొదటి ఓటు వేశాం’’ అని కాలేజీ స్టూడెంట్‌ హిమాన్షు జైయాస్వాల్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద పీటీఐతో చెప్పాడు.

‘‘ఇది ప్రజాస్వామ్య పండుగ. ఇందులో అందరూ పాల్గొనాలి’’ అని మరో ఓటర్‌ జై సింగ్‌ పేర్కొన్నారు.

గెలుపు మాదే..

కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత లేదని, రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోధ్‌పూర్‌లో ముఖ్యమంత్రి గెహ్లాట్‌ ( Ashok Gehlot ) ఆశాభావం వ్యక్తం చేశారు.

గెహ్లాట్‌ వ్యాఖ్యలకు మాజీ సీఎం వసుంధర రాజే (Vasundara raje) కౌంటర్‌ ఇచ్చారు. ‘‘ప్రస్తుత ఎన్నికలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. డిసెంబర్‌ 3న కమలం వికసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరనే ప్రశ్నకు..పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆమె చెప్పారు.

ప్రజాస్వామ్యానికి ప్రతిబింబిం..

1952 నుంచి ఓటింగ్‌ శాతం క్రమేణా పెరగడం ప్రజాస్వామ్య బలాన్ని ప్రతిబింబిస్తోందని.. అందుకు మనమంతా గర్వించాలని లోక్‌సభ స్పీకర్‌ విలేఖరులతో అన్నారు.

జోధ్‌పూర్‌లో కేంద్ర మంత్రి షెకావత్‌ (Gajendra Singh Shekhawat) మాట్లాడుతూ.. ‘‘బీజేపీ (BJP) భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తోంది. ఐదేళ్ల కాంగ్రెస్‌ హయాంలో మహిళలపై జరిగిన నేరాలు, పేపర్‌ లీక్‌ ఘటనలు, అవినీతిని దృష్టిలో ఉంచుకుని ఈసారి జనం ఓటు వేస్తారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ (congress) అధికారాన్ని నిలబెట్టుకోవడం ఖాయమని అర్బన్‌ డెవలప్‌మెంట్‌, హౌసింగ్‌ మంత్రి ధరివాల్‌ పేర్కొన్నారు.

Read More
Next Story