అక్కడ గెలిచారు..కాని ఇక్కడ ఓడారు...
ఈ రెండు స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమనుకున్నారు. కాని ఒక చోట మాత్రమే గెలిచింది. మరో స్థానం బీజేపీ శ్రేణులను నిరాశపరిచింది.
అంబర్‌పేట స్థానం బీజేపీకి ఎంతో కీలకం. గతంలో ఇక్కడి నుంచి ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గెలుపొందారు. ఈ సారి ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో ఆ స్థానాన్ని క్రిష్ణ యాదవ్‌కు కేటాయించి, గెలిపించే బాధ్యత కిషన్ రెడ్డికే అప్పగించారు పార్టీ పెద్దలు. కాని ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ విజయం సాధించారు.
ఇక గోషామహాల్ నియోజకవర్గం నుంచి రాజా సింగ్ పోటీ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్‌ను గతంలో పార్టీ సస్పండ్ చేసిన విషయం తెలిసిందే. కాని ఆయనకే ఈ సారి టికెట్ ఇచ్చి పోటీకి నిలిపింది కమలం పార్టీ. అయితే ఈ సారికూడా ఆయన గెలుపొంది హ్యాట్రిక్ సాధించి బిజెపి పరువు కాపాడారు. బీజేపీ ఈ రెండు స్థానాలపై ఎంతో నమ్మకం పెట్టుకుంది. ఈజీగా గెలుస్తామనుకున్నారు. కాని అంబర్‌పేటలో ఓటమి బీజేపీ శ్రేణులను నిరాశ పరిచింది. ఈ సారి బిజెపి జాబితలోకి ఒక జెయింట్ కిల్లర్ చేరినా అనేక మంది సీనియర్లు ఓడిపోయారు. జెయింట్ కిల్లర్ కామారెడ్డి నుంచి గెలిచిన కె వెంకటరమణా రెడ్డి. నిరాశపర్చిన మిగతా వాళ్లు, రఘునందన్ రావు (దుబ్బాక), ఈటెల రాజేందర్ (హుజూరాబాద్, గజ్వేల్) బండి సంజయ్ కుమార్ (కరీంనగర్).