ఎన్నికల ఫలితాలకు ముందు మోదీ బిజీ..బిజీ..
x

ఎన్నికల ఫలితాలకు ముందు మోదీ బిజీ..బిజీ..

లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు సోమవారం ప్రధాని మోదీ ఉన్నతాధికారులు, పార్టీ అగ్రనేతలతో బిజీగా గడిపారు. ఇంతకు వారితో ఏ అంశాలపై చర్చించారు?


లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడతాయి. అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఎక్సిట్ పోల్ సర్వేల ఆధారంగా కొన్ని పార్టీలు ఇప్పటికే ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇటు కేంద్రంలో మూడోసారి ముచ్చటగా అధికారంలోకి వస్తామన్న బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవర్‌లోకి వచ్చాక, తొలి 100 రోజుల్లో ఏం చేయాలన్న దానిపై ప్రధాని మోదీ ఆదివారం మేధోమథనం నిర్వహించారు.

అయితే ఈ సమావేశం ప్రధాని ఆడుతున్న మైండ్ గేమ్ అని కాంగ్రెస్ చెబుతోంది. మోదీని ఔట్ గోయింగ్ పీఎంగా అభివర్ణిస్తున్నారు.

శనివారం ప్రసారమైన ఎగ్జిట్ పోల్స్.. బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) భారీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది.

ప్రధాని మోదీ రోజంతా ఏడు సమావేశాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ మధ్య ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో హాస్పిటల్స్‌లో ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్‌ క్రమం తప్పకుండా నిర్వహించాలని మోదీ సూచించారు.

ఈశాన్య ప్రాంతంలో రెమాల్ తుఫాను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. తుఫాను అనంతర పరిస్థితులపై మోదీ సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయాన్ని అందజేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని(జూన్ 5న) పురస్కరించుకుని సన్నాహాలపై సమీక్షించారు.

Read More
Next Story