లోక్‌సభలో ఎస్పీ నేతగా అఖిలేష్ యాదవ్
x

లోక్‌సభలో ఎస్పీ నేతగా అఖిలేష్ యాదవ్

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ లోక్‌సభలో పార్టీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన లాంఛనాలు ఢిల్లీలో తర్వలో పూర్తికానున్నాయి.


సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ లోక్‌సభలో పార్టీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన లాంఛనాలు ఢిల్లీలో తర్వలో పూర్తికానున్నాయి.

కర్హాల్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్న అఖిలేష్ యాదవ్ శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఎంపీగా గెలవడంతో ఆయన ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకున్నారు. ప్రతిపక్ష నేత బాధ్యతలను సీనియర్ నేత శివపాల్ యాదవ్‌కి అప్పగించే అవకాశం ఉందని సమాచారం.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ప్రతిపక్ష నేతగా ఉన్నయాదవ్ తర్వలో రాజీనామా చేస్తారని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు.

ఘన విజయం..

యూపీలోని మొత్తం 80 స్థానాలకు ఎస్పీ ఏకంగా 37 స్థానాలను గెలుచుకుని లోక్‌సభలో మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎస్పీ మిత్రపక్షం కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ కేవలం 33 సీట్లకు పరిమితమైంది.

బాధ్యత పెరిగింది..

యాదవ్ అధ్యక్షతన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిలేష్ మాట్లాడారు. ముందుగా ఎంపీలుగా గెలిచిన వారికి అభినందనలు తెలిపారు. గెలుపుతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. ప్రజా సమస్యలపై సమాజ్‌వాదీ పోరాటం కొనసాగించాలని కోరారు.

Read More
Next Story