మహాయుతి కూటమిలో చిచ్చు రేపుతున్న ‘‘బటేంగే తో కటేంగే’’ నినాదం
x

మహాయుతి కూటమిలో చిచ్చు రేపుతున్న ‘‘బటేంగే తో కటేంగే'’’ నినాదం

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నినాదం ‘‘బటేంగే తో కటేంగే’’ (విడిపోతే నాశనమైపోతాం) మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో చిచ్చురేపుతోంది.


మహారాష్ట్రలో ఇంకో 5 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నినాదం ‘‘బాటేంగే తో కటేంగే’’(విడిపోతే నాశనమైపోతాం) మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో చిచ్చురేపుతోంది. ఈ నినాదంపై పలువురు నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మహాయుతి కూటమి భాగస్వామ్య అజిత్ పవార్ ఈ నినాదాన్ని వ్యతిరేకించారు. “మహారాష్ట్రలో ఇది పనిచేయదు. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌లో పనిచేస్తే చేయొచ్చు. దీనికి నేను మద్దతు ఇవ్వడం లేదని గతంలో చాలాసార్లు చెప్పాను.’’ అని అజిత్ పవార్ పేర్కొన్నారు.

అజిత్ వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పందించారు. Maharashtra Assembly elections, Ajit Pawar, Devendra Fadnavis“అజిత్ పవార్ లౌకిక, హిందూ వ్యతిరేక భావజాలంతో ఉన్నారు. సెక్యులరిస్టులమని చెప్పుకునే వారిలో అసలు సెక్యులరిజమే లేదు. హిందుత్వాన్ని వ్యతిరేకించడమే లౌకికవాదం అని భావించే వ్యక్తులతో ఆయన కలిసి ఉన్నారు. ప్రజల మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ఆయనకు కొంత సమయం పడుతుంది' అని ఫడ్నవీస్ పేర్కొన్నారు.

దివంగత బీజేపీ అగ్రనేత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజా ముండే కూడా యోగి నినాదం గురించి మాట్లాడారు. తన రాజకీయాలు భిన్నమైనవని చెప్పుకొచ్చారు. తాను అదే పార్టీ నుంచి వచ్చినా దానికి మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. ప్రతీ మనిషిని ఏకం చేయడమే నాయకుడి పని అని ఆమె చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఫిబ్రవరిలో బీజేపీలో చేరిన అశోక్ చవాన్ కూడా ఈ నినాదానికి తాను అనుకూలం కాదన్నారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నినాదం ఇటీవల హర్యానా ఎన్నికల్లో బలంగా పనిచేసింది. హిందువులు అంతా ఐక్యంగా ఉండాలన్నదే ఆ నినాదానికి అర్థం. బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిని ప్రస్తావిస్తూ.. విడిపోతే నాశనం అవుతామని అని వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ చేస్తున్న ‘‘కులగణన’’ అనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ ‘‘ఏక్ హైతో సేఫ్ హై’’ (కలిసి ఉంటేనే సేఫ్) అని మరో నినాదం లేవనెత్తారు. మహారాష్ట్రలోని 288 స్థానాలకు నవంబర్ 20న ఓటింగ్ జరగనుంది. 23న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Read More
Next Story