పోటెత్తిన ఓటర్లు..9 గంటలకే హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధిక ఓటింగ్ శాతం
x
వారణాసిలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేయడానికి క్యూలో నిలుచున్న ఓటర్లు ఫోటో: PTI

పోటెత్తిన ఓటర్లు..9 గంటలకే హిమాచల్ ప్రదేశ్‌లో అత్యధిక ఓటింగ్ శాతం

లోక్‌సభ ఎన్నికల చివరి ధఫా పోలింగ్‌లో మొత్తం 10.06 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 9 గంటలకు హిమాచల్ ప్రదేశ్ పోలింగ్ శాతం 14.35%గా నమోదైంది.


ఏడు రాష్ట్రాలలోని 57 స్థానాలకు అలాగే కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో శనివారం చివరి దశ పోలింగ్ జరగనుంది. వీటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న వారణాసి కూడా ఉంది.

ఎలక్షన్ కమిషన్ డేటా (ఉదయం 9 గంటలకు) ప్రకారం.. మొత్తం పోలింగ్ శాతం 11.64% కాగా, హిమాచల్ ప్రదేశ్ 14.35% తో ముందంజలో ఉంది. మిగతా రాష్ట్రాల్లో జార్ఖండ్ 12.15%, ఒడిశా 7.69%, పంజాబ్ 9.64%, ఉత్తరప్రదేశ్ 12.94%, పశ్చిమ బెంగాల్ 12.63% గా నమోదైంది.

చివరి దఫాలో ఓటర్ల సంఖ్య..

చివరి దశలో మొత్తం 10.06 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 5.24 కోట్ల మంది పురుషులు, 4.82 కోట్ల మంది మహిళలు, 3,574 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

ఎక్కడ ఎన్ని స్థానాలకు..

పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలు, హిమాచల్ ప్రదేశ్‌లోని 4, ఉత్తరప్రదేశ్‌లోని 13, పశ్చిమ బెంగాల్‌లో 9, బీహార్‌లో 8, ఒడిశాలో 6, చండీగఢ్‌తో పాటు జార్ఖండ్‌లో మూడు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఒడిశాలోని మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు, హిమాచల్ ప్రదేశ్‌లోని 6 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఒకేసారి జరగనున్నాయి.

పోటీలో ఉన్న ప్రముఖలు..

మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ప్రముఖులు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, లాలూ ప్రసాద్ కుమార్తె మిసా భారతి, నటి కంగనా రనౌత్ ఉన్నారు.

నేటితో ముగియనున్న పోలింగ్ మారథాన్..

ఏప్రిల్ 19న ప్రారంభమైన మారథాన్ పోలింగ్ నేటితో ముగియనుంది. ఇప్పటికే 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 486 లోక్‌సభ స్థానాలను ఇది కవర్ చేసింది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉండగా.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో జూన్ 2న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం.. టెలివిజన్ ఛానెళ్లు జూన్ 1 సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూయించేందుకు అనుమతి ఇచ్చారు.

నేడు ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు..

ఉత్తర ప్రదేశ్..

ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలు: 80లో 13 (మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, ఖుషీనగర్, డియోరియా, బన్స్‌గావ్, ఘోసి, సలేంపూర్, బల్లియా, ఘాజీపూర్, చందౌలీ, వారణాసి, మీర్జాపూర్, రాబర్ట్స్‌గంజ్)

పంజాబ్..

ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలు: మొత్తం 13 (గురుదాస్‌పూర్, అమృత్‌సర్, ఖదూర్ సాహిబ్, జలంధర్, హోషియార్‌పూర్, ఆనంద్‌పూర్ సాహిబ్, లూథియానా, ఫతేఘర్ సాహిబ్, ఫరీద్‌కోట్, ఫిరోజ్‌పూర్, బటిండా, సంగ్రూర్, పాటియాలా)

హిమాచల్ ప్రదేశ్..

ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలు: మొత్తం 4 (కంగ్రా, మండి, హమీర్‌పూర్, సిమ్లా) ఉపఎన్నికలు జరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు – 6 (గాగ్రెట్, ధర్మశాల, బర్సర్, లాహౌల్ & స్పితి, కుట్లేహర్ మరియు సుజన్‌పూర్)

బీహార్..

ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలు: 40లో 8 (పాట్నా సాహిబ్, పాటలీపుత్ర, అర్రా, బక్సర్, ససారం, కరకట్, జహనాబాద్, నలంద)

జార్ఖండ్..

ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలు: 11లో 3 (రాజ్‌మహల్, దుమ్కా, గొడ్డ)

ఒడిషా..

ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలు: 21లో 6 (మయూర్‌భంజ్, బాలాసోర్, భద్రక్, జాజ్‌పూర్, కేంద్రపరా, జగత్‌సింగ్‌పూర్)

పశ్చిమ బెంగాల్..

ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలు: 42లో 9 (దమ్ దమ్, బరాసత్, బసిర్హత్, జయనగర్, మధురాపూర్, డైమండ్ హార్బర్, జాదవ్‌పూర్, కోల్‌కతా దక్షిణ్, కోల్‌కతా ఉత్తరం)

Read More
Next Story