‘రెబెల్స్‌ను ఎన్నికల బరి నుంచి తప్పించండి’
x

‘రెబెల్స్‌ను ఎన్నికల బరి నుంచి తప్పించండి’

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో రెబల్స్ బరిలో ఉండకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి రమేష్ చెన్నితాల పార్టీ నాయకత్వాన్ని ఆదేశించారు.


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో రెబల్స్ బరిలో ఉండకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి రమేష్ చెన్నితాల పార్టీ నాయకత్వాన్ని ఆదేశించారు. బుధవారం ఆయన ముంబైలో విలేఖరులతో మాట్లాడారు. ‘‘మహారాష్ట్రలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ శ్రేణుల నుంచి తిరుగుబాటును ఎదుర్కొంటున్నాయి. టిక్కెట్ దక్కని పార్టీ నాయకులు అధిష్టానాన్ని ధిక్కరించి నామినేషన్లు వేశారు. ఇది మహాయుతి, MVA రెండింటికీ తలనొప్పిగా మారింది. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా సమయం ఉంది. సాధ్యమయినంత వరకు రెబల్స్‌ను బరినుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తాం’’ అని అన్నారు.

MVAలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే యొక్క శివసేన (UBT) శరద్ పవార్ NCP (SP) ఉన్నాయి. మహాయుతిలో BJP, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేన, డిప్యూటీ CM అజిత్ పవార్ నేతృత్వంలోని NCP ఉన్నాయి.

‘‘నో ఫ్రెండ్లీ కాంటెస్ట్’’

‘‘సమాజ్‌వాదీ పార్టీతో మా పార్టీ నాయకుడు నసీం ఖాన్‌ను మాట్లాడతారు. MVAలో స్నేహపూర్వక పోరాటాలు ఉండవు. బాలాసాహెబ్ థోరట్, విజయ్ వాడెట్టివార్, నానా పటోలే తిరుగుబాటుదారులతో మాట్లాడతారు. నవంబర్ 4 నాటికి సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం. MVA ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా లక్ష్యం" అని మహారాష్ట్ర అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్‌ఛార్జ్ చెన్నితాల చెప్పారు.

Read More
Next Story