జార్ఖండ్‌లో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్..
x
Jharkhand State Finance minister Rameshwar Oraon

జార్ఖండ్‌లో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్..

కాంగ్రెస్ పార్టీ సోమవారం అర్ధరాత్రి 21 మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను రిలీజ్ చేసింది.


జార్ఖండ్‌ శాసనసభకు నవంబర్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం ప్రారంభించాయి. కాంగ్రెస్ పార్టీ సోమవారం అర్ధరాత్రి 21 మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను రిలీజ్ చేసింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశంలో ఈ పేర్లను ఖరారు చేశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సహా పలువురు సీనియర్ నేతలు సమావేశమై అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం)తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.

ఎవరు ఎక్కడి నుంచి..

ఎస్‌టీ రిజర్డ్వ్ లోహర్‌దగా నియోజకవర్గం నుంచి రాష్ట్ర ఆర్థిక మంత్రి రామేశ్వర్ ఓరాన్‌ పోటీ చేస్తున్నారు. ఓరాన్‌తో పాటు ఇర్ఫాన్ అన్సారీ బాదల్ పత్రలేఖ్, బన్నా గుప్తా, జలేశ్వర్ మహ, దీపికా పాండే సింగ్‌ సహా చాలా మంది ప్రస్తుత ఎమ్మెల్యేలు మళ్లీ నామినేట్ అయ్యారు. జంషెడ్‌పూర్ మాజీ ఎంపీ, త్రిపుర, ఒడిశా, నాగాలాండ్‌కు పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న అజోయ్ కుమార్ జంషెడ్‌పూర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఈ స్థానం బీజేపీ మాజీ సీనియర్ సరయూ రాయ్‌కు కంచుకోట.

ఇక బీజేపీ నుంచి బరిలో..

ఒడిశా గవర్నర్‌ కోడలు, జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్‌ దాస్‌ కోడలు పూర్ణిమా దాస్‌ సాహును జంషెడ్‌పూర్‌ తూర్పు స్థానం నుంచి బీజేపీ తరుపున పోటీ చేస్తున్నారు. రఘుబర్ దాస్ 1995 నుంచి 2014 వరకు వరుసగా ఐదు సార్లు జంషెడ్‌పూర్ తూర్పు నుంచి BJP ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. 2019లో కూడా ఇదే స్థానం నుంచి పోటీచేశారు. అయితే BJP నుంచి వైదొలిగి, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సరయూ రాయ్ చేతిలో ఓడిపోయారు.

లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీని వీడిన జై ప్రకాష్ పటేల్ తన సంప్రదాయ స్థానం మండు నుంచి బరిలోకి దిగారు. జై ప్రకాష్ పటేల్ హజారీబాగ్ నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే బీజేపీ అభ్యర్థి మనీష్ జైస్వాల్ చేతిలో ఓటమి చెందారు. ఇక షిప్లి నేహా టిర్కీ మందార్ (ఎస్టీ) నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈ స్థానం నుంచి ఈమె ప్రస్తుతంగా ఎమ్మెల్యే ఉన్నారు.

జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Read More
Next Story