కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల వీడియో కాన్పరెన్స్..
x

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల వీడియో కాన్పరెన్స్..

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కెసి వేణుగోపాల్ ఆదివారం సమావేశమయ్యారు.


జూన్ 4 ఓట్ల లెక్కింపు జరగనుంది. అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. వారు ఎవరితో మాట్లాడారు. ఏం సూచించారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కెసి వేణుగోపాల్, ఇతర సీనియర్ నేతలు ఖర్గే నివాసంలో ఆదివారం సమావేశమయ్యారు. కౌంటింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో వారు లోక్‌సభ అభ్యర్థులతో జూమ్ మీటింగ్‌లో మాట్లాడారు. జూన్ 4న ఓట్ల లెక్కింపుకు ముందు సన్నాహాలపై సమీక్షించారు. తాము 295 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ భారీ మెజారిటీ సాధిస్తుందని, ప్రధాని మోదీ వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారన్న అంచనాల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.

'ఎగ్జిట్ పోల్స్ బోగస్'

అయితే శనివారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ బోగస్ అని కొట్టిపడేశారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జై రాం రమేష్. "ఇవన్నీ అవుట్‌గోయింగ్ ప్రధాని (నరేంద్ర మోడీ), అవుట్‌గోయింగ్ హోం మంత్రి (అమిత్ షా) ఆడుతున్న మైండ్ గేమ్‌లో భాగం.’’ అని పేర్కొన్నారు.

రెండున్నర గంటల వీడియో కాన్ఫరెన్స్ అనంతరం తన నివాసం ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. మంగళవారం కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి చర్చించినట్లు చెప్పారు. ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలని, ఫలితాలు పూర్తిగా ప్రకటించే వరకు కౌంటింగ్ హాలు నుంచి బయటకు రావద్దని పార్టీ కార్యకర్తలను ఆదేశించినట్లు చెప్పారు.

Read More
Next Story