8న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
x

8న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చించనుంది. ఈ మేరకు జూన్ 8న సమావేశం కానుంది.


కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చించనుంది. ఈ మేరకు జూన్ 8న సమావేశం కానుంది. ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహిస్తారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2019లో 52 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు 99 స్థానాలు సాధించింది. పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రతిపక్ష హోదా కాంగ్రెస్‌కు దక్కనుంది. 2014, 2019లో మొత్తం స్థానాల్లో (543) ఎంపీల సంఖ్య 10% కంటే తక్కువగా ఉండడంతో ప్రతిపక్ష హోదా దక్కించుకోలేకపోయింది.

Read More
Next Story